UCO Bank Notification 2025:
కేంద్ర ప్రభుత్వ బ్యాంకుల్లో ఒకటైనటువంటి UCO బ్యాంక్ లో 250 పోస్టులతో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. తెలుగు చదవడం, రాయడం వచ్చినవారికి అవకాశం కల్పిస్తూ ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత రాష్ట్రంలోని UCO బ్యాంకుల్లో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
UCO బ్యాంక్ నుండి విడుదలయిన 250 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 16th జనవరి 2025 నుండి 5th ఫిబ్రవరి 2025 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹850/- ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ₹175/- ఫీజు ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ లో Fee పేమెంట్ చెయ్యాలి.
కోల్ ఇండియాలో 434 గవర్నమెంట్ జాబ్స్ విడుదల: Any డిగ్రీ
ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:
బ్యాంకుల్లో ఒకటైనటువంటి UCO బ్యాంక్ నుండి 250 లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని తెలుగు భాష వచ్చి, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్:
UCO బ్యాంక్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, కంప్యూటర్ అప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, డేటా ఎనాలిసిస్ & ఇంటరప్రటేషన్ వంటి అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.
Ap ప్రభుత్వం అన్ని జిల్లాలవారికి 250+ Govt జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹45,009/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
10th అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి (Age ప్రూఫ్ కోసం)
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
HPCL 234 ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply
ఎలా Apply చెయ్యాలి:
uco బ్యాంక్ లో 250 ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
బ్యాంక్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.