NFDB Notification 2024:
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుండి కన్సల్టెంట్ గ్రేడ్ 1, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మానిటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి, 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ చేసుకోగలరు.
ముఖ్యమైన ఇంటర్వ్యూ తేదీలు:
మత్స్య శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి పరీక్ష లేకుండా 17th డిసెంబర్ 2024 న హైదరాబాద్ లోని NFDB డిపార్ట్మెంట్ ఆఫీస్ నందు ఇంటర్వ్యూలు ఉంటాయి.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుండి కన్సల్టెంట్ గ్రేడ్ 1, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్, మానిటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగినవారు దరఖాస్తులు పూర్తి చేసి ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.
రైల్వేలో 1800+ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల: 10th, 10+2
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 17th డిసెంబర్ రోజున ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. అనుభవం కూడా వున్నవారికి ఎక్కువ ప్రాధన్యత ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులుమాకు నెలకు పోస్టులను అనుసరించి ₹53,000/- శాలరీ ఉంటుంది. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
గ్రామీణ పోస్టల్ ఆఫీసుల్లో ఉద్యోగాలు: 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఇవి టెంపరరీ ఉద్యోగాలు కావున SC, ST, OBC అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
అప్లికేషన్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూ కి హాజరు కావడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు గురించిన సమాచారం ఇవ్వబడలేదు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు : 33,566 జాబ్స్
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అనుభవం కలిగిన డాక్యుమెంట్స్ ఉండాలి
ఎలా Apply చేసుకోవాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification PDF & Application Form
మత్స్య శాఖలో ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.