NIRDPR Notification 2024:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి 14 కన్సల్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. 9 నెలలు కాంట్రాక్టు పద్దతిలో పని చేసేందుకుగానూ ఈ ప్రకటన జారీ చేయడం జరిగింది. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి సోషల్ సైన్స్, MBA, అగ్రికల్చర్, స్టాటిస్టిక్స్ వంటి పలు విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా Ph. D లేదా MBA అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
గ్రామీణాభివృద్ధి శాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలుకు ఆన్లైన్ విధానంలో నవంబర్ 18th, 2024 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు అంగీకరించబడవు.
ఉద్యోగాల వివరాలు, వాటి అర్హతలు:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ & పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నుండి 14 కన్సల్టెంట్, రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. సోషల్ సైన్స్, MBA, అగ్రికల్చర్, స్టాటిస్టిక్స్ వంటి పలు విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా Ph. D లేదా MBA అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.
AP దేవాదాయ శాఖలో 500 పోస్టులు : Apply
ఎంత వయస్సు ఉండాలి:
NIRDPR రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుండి 35 సంవత్సరాలు, కన్సల్టెంట్ పోస్టులకు 18 నుండి 63 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది. SC, ST, OBC అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:
ఆన్లైన్ లో అప్లికేషన్స్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలంచ్, అనుభవం, వయస్సు ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
రైల్వేలో 5,647 పోస్టులకు నోటిఫికేషన్ : Apply
శాలరీ వివరాలు:
రీసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹22,000/- జీతం, కన్సల్టెంట్ ఉద్యోగాలకు ₹40,000/- జీతాలు చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
తెలంగాణాలో గ్రంధాలయాల్లో ఉద్యోగాలు : No Exam
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి. career.
nirdpr.in వెబ్సైటులో గాని లేదా ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ PDF, Apply ఆన్లైన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
గ్రామీణాభివృద్ధి సంస్థలో విడుదలయిన ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.