పంచాయతీ రాజ్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | NIRDPR Notification 2024 | Freejobsintelugu

Panchayat Raj Notification 2024:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ శాఖ నుండి (NIRDPR) ట్రైనింగ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి అప్లికేషన్స్ పెట్టుకోగలరు.

పోస్టులు, అర్హతలు:

ట్రైనింగ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ సోషల్ సైన్స్ లో, రూరల్ డెవలప్మెంట్, రూరల్ మానేజ్మెంట్ విభాగాల్లో చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. PHD చేసిన అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Our Telegram Group

శాలరీ వివరాలు:

కాంట్రాక్టు పద్దతిలో విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకి ₹60,000/- జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు. ఒక సంవత్సరం పాటు కాంట్రాక్టు విధానంలో పని చెయ్యాలి.

సికింద్రాబాద్, విజయవాడ రైల్వేలో 478 Govt జాబ్స్

దరఖాస్తు తేదీలు, వయస్సు వివరాలు:

అర్హతలు కలిగిన అభ్యర్థులు 18th సెప్టెంబర్ 2024 లోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. ఆఖరు తేదీ తర్వాత దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అప్లికేషన్స్ అంగీకరించబడవు.

18 నుండి 50 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

Ap మంత్రుల పెషిల్లో ఉద్యోగాలు : No Exam

ఫీజు ఎంత?:

ఈ ఉద్యోగాలకు ₹300/- ఫీజు UR, OBC, EWS అభ్యర్థులు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. ఇది నాన్ రిఫండబల్ ఫీజు.

ఎంపిక విధానం:

అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులలలో మెరిట్ మార్కులు, అనుభవం ఉన్నవారిని ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ లు లేవు. అవసరం అయితే ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది.

TGSRTC నోటిఫికేషన్ : 5 రోజుల్లో జాబ్

ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి:

అర్హత కలిగిన అభ్యర్థులు క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్ ఆధారంగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. గడువులోగా అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకోగలరు.

నోటిఫికేషన్ PDF

Online Apply Link

పంచాయతీ రాజ్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!