DRDO లో కొత్త ఉద్యోగాల భర్తీ | DRDO Recruitment 2024 | Freejobsintelugu

DRDO Recruitment 2024:

డిఫెన్సె రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ ఆర్గనైజషన్ (DRDO) కు సంబందించిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుండి గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఒక సంవత్సరం కాలంపాటు అప్రెంటీస్ లుగా పని చెయ్యాలి. డిప్లొమా, డిగ్రీలో అర్హత కలిగినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కటే రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులవారీగా అర్హతలు:

2020,2021, 2022,2023,2024 సంవత్సరంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోకూడదు. అలాగే డిప్లొమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Our Telegram Group

వయస్సు, స్టైపెండ్ వివరాలు:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹9,000/- స్టైపెండ్ ఇస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు

సెలక్షన్ ప్రాసెస్:

Offline లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసియ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూలో మంచి నైపుణ్యం కనబరిచినవారికి ఉద్యోగాలు ఇస్తారు.

ముఖ్యమైన సూచనలు:

• ఈ అప్రెంటీస్ ట్రైనింగ్ మొత్తం 12 నెలలు ఉంటుంది.

• సందేహలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన Help లైన్ నంబర్స్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు

• సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

• ఎటువంటి TA, DA ఇవ్వడం జరగదు.

• దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు వారియొక్క అర్హతలను సరిచేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

• నోటిఫికేషన్ లో ఇచ్చిన అర్హతకు ఉన్నవారు మాత్రం Apply చేసుకోవాలి.

మొత్తం ఖాళీలు ఎన్ని:

54 పోస్టులతో DRDO ITR సంస్థ నుండి నోటిఫికేషన్ జరిగింది చేశారు. ఇవి అప్రెంటీస్ ఉద్యోగాలు. పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాదు.

ఎలా Apply చేసుకోవాలి:

అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో 7th అక్టోబర్ లోగా దరఖాస్తులు పూర్తి చేసి సంబందించిన అడ్రస్ కు పంపించాలి. దరఖాస్తుతో పాటు మీ సర్టిఫికెట్స్, కమ్యూనిటీ సర్టిఫికెట్, మార్క్స్ లిస్ట్, ఇతర డాక్యుమెంట్స్ అన్ని కలిపి పంపించాలి. అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్స్ మీరు ఆన్లైన్ లోనే పొందవలసి ఉంటుంది.

దరఖాస్తు ఆఖరి తేదీ:

07.10.2024 తేదీలోపు అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.

పూర్తి నోటిఫికేషన్ డాక్యుమెంట్, అప్లికేషన్ ఫారం కోసం ఈ క్రింద ఉన్న లింక్స్ ద్వారా పొందవచ్చు.

Notificatio PDF

Application Form

DRDO, ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు ని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!