Postal GDS Special Notification 2024:
తపాలా శాఖ నుండి ఇటీవల విడుదలయిన 44,228 పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆ ఉద్యోగాల అప్లికేషన్ ఆఖరి తేదీ ముగియడంతోపాటు మొదటి మెరిట్ లిస్ట్ ఫలితాలు కూడా విడుదల చేశారు. అయితే ఈరోజు మణిపూర్ కి సంబందించిన స్పెషల్ GDS నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయ్యి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లై చేసుకోవచ్చు. స్పెసల్ డ్రైవ్ ప్రకటన పూర్తి వివరాలు చూసి దరఖాస్తు పూర్తి చెయ్యండి.
పోస్టల్ స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ కి ఎవరు అర్హులు:
జూలైలో విడుదలయిన పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ లో మణిపూర్ రాష్ట్రానికి సంబందించిన ఖాళీలు విడుదల చెయ్యలేదు. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి సంబందించిన GDS ఖాళీలను నింపడానికి కొత్తగా పోస్టల్ శాఖవారు GDS స్పెషల్ డ్రైవ్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈరోజు ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాలకు చెందిన 10వ తరగతి ఉత్తీర్ణత పొందినవారందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10,13,15 సంవత్సరాల వయో సడలింపు కల్పిస్తారు.
తెలంగాణాలో 10,954 VRO ఉద్యోగాలు : ఇంటర్ అర్హత
జీతం, సెలక్షన్ విధానం:
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ₹18,500/- జీతం ఇస్తారు
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా ఎంపిక అయిన అభ్యర్థులకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని ₹14,500/- వేతనం చెల్లిస్తారు.
గ్రామీణ డౌక్ సేవక్ ఉద్యోగాలను 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మీ జాబ్ వచ్చిన లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు.
ఏపీలో 488 అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు:
UR, OBC, EWS పురుష అభ్యర్థులకు ₹100/- ఫీజు కేటాయించారు. మహిళలు, SC, ST, PWD, ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
నీటిపారుదలశాఖలో 10th అర్హతతో Govt జాబ్స్
అప్లికేషన్ తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 /08/2024
దరఖాస్తు ఆఖరు తేదీ : 03/09/ 2024
ఎలా అప్లై చేసుకోవాలి:
అర్హతకు కలిగిన అభ్యర్థులు https://indiapostgdsonline.gov.in/వెబ్సైటు నందు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్, అప్లికేషన్ ఆన్లైన్ వివరాలు కలిగిన లింక్స్ ఈరోజు క్రింద ఉన్నాయి. చూసి వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.
పోస్టల్ శాఖ నోటిఫికేషన్స్ సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని సందర్సించండి.