గురు నానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?. ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయా?. అనే సందేహాలు విద్యార్థులు తల్లిదండ్రులు మరియు ఉద్యోగుల్లో నెలకొని ఉంది. ఈ పర్వదినం సందర్భంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సెలవుల విషయంలో వేరు వేరు నిర్ణయాలు ఉండడంతో సెలవు వివరాలను తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

తెలంగాణలో రేపు ప్రభుత్వ స్కూళ్లకు మరియు కార్యాలయాలకు సెలవు ఉందా?:
గురునానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలోని ప్రభుత్వ స్కూల్లో మరియు ఆఫీసులకు జనరల్ హాలిడే ఉండనుంది. ప్రైవేటు పాఠశాలలు కూడా రేపు మూతపడనున్నాయి. అయితే ప్రైవేటు పాఠశాలలు సెలవు ప్రకటించే అవకాశం ఉండడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాల నిర్ణయాలకు సంబంధించి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సెలవుకి సంబంధించిన నోటీస్ ని గమనించవలెను.
ఆంధ్రప్రదేశ్లో రేపు సెలవు ఉందా లేదా?
ఆంధ్రప్రదేశ్లో రేపు గురునానక్ జయంతి మరియు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆప్షనల్ హాలిడే ప్రభుత్వం ప్రకటించింది. ఆప్షనల్ హాలిడే కావడంతో సెలవుల వినియోగంపై సంబంధిత సంస్థలు, అధికారుల నిర్ణయాలు, స్థానిక పరిస్థితులపై సెలవు ఇవ్వాలా వద్దా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.
గురునానక్ జయంతి ప్రాముఖ్యత ఏమిటి?:
సిక్కు మత స్థాపకుడైన గురునానక్ దేవ్ జి 1469 లో కార్తీక పౌర్ణమి సందర్భంగా జన్మించారు. ఆయన జన్మదినాన్ని సిక్కు మతస్థులు ఎంతో పవిత్రమైన దినంగా జరుపుకుంటారు. ఆ రోజున గురుద్వారాల్లో ప్రత్యేకమైన ప్రార్థనలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సెలవులకు సంబంధించిన అధికారిక సమాచారం ఏమైనా వచ్చినట్లయితే దానికి అనుగుణంగా విద్యార్థులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు మలుచుకోవలసి ఉంటుంది.