గుడ్ న్యూస్: స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు: School Holidays 2026 : Full details

By: Sivakrishna Bandela

On: February 5, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

School Holidays In Telangana:

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనున్నందున ఆరోజు ఎన్నికల కౌంటింగ్ నిర్వహించే స్కూళ్లకు సెలవులు ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 14 రెండవ శనివారం, ఫిబ్రవరి 15 ఆదివారం రావడంతో, స్కూల్ విద్యార్థులకు వరుసగా మూడో రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. మళ్లీ పాఠశాలలో ఫిబ్రవరి 16వ తేదీన పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నట్లు అధికారులు తెలిపారు. దీనిపైన అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. స్కూళ్ల సెలవులకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాము

13వ తేదీన స్కూళ్లకు హాలిడే:

ఫిబ్రవరి 13వ తేదీన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ఇవ్వొచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా కౌంటింగ్ నిర్వహించే స్కూల్లో వినియోగించడం ద్వారా, ఆ పాఠశాలల్లోని విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి సెలవులు ప్రకటిస్తారు. అలాగే విద్యార్థుల యొక్క భద్రతా దృష్ట్యా స్కూల్స్ హాలిడే ప్రకటించే అవకాశం ఉంటుంది.

అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయలేదు. జిల్లా కలెక్టర్లు మరియు విద్యాశాఖ అధికారుల సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదలైంది – ఇలా దరఖాస్తులు చేసుకోండి. | inter admissions 2026 started

ఫిబ్రవరి 14 15 తేదీల్లో ఇప్పటికే సాధారణ సెలవులు:

ఈనెల ఫిబ్రవరి 14 తేదీ రెండో శనివారం అయినందువల్ల ఆరోజు సెలవు ఉంటుంది. అలాగే ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం అయినందువల్ల ఆరోజు సెలవు ఉంటుంది. ఈ కారణంగా ఫిబ్రవరి 13వ తేదీన సెలవు ప్రకటిస్తే వరుసగా విద్యార్థులకు మూడు రోజులు సెలవులు రానున్నాయి.

  • ఫిబ్రవరి 13 : మున్సిపల్ ఎలక్షన్స్ కౌంటింగ్ డే సెలెవు
  • ఫిబ్రవరి 14 : రెండవ శనివారం
  • ఫిబ్రవరి 15: ఆదివారం

మున్సిపల్ ఎన్నికల వివరాలు :

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా

  • ఏడు మున్సిపల్ కార్పొరేషన్ లు
  • 116 మున్సిపాలిటీలు

ఈనెల 11వ తేదీన పైన తెలిపినటువంటి మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఫిబ్రవరి 13వ తేదీన నిర్వహిస్తారు

AP ICET 2026 Application Last Date LIVE : Registration With Late FEE ₹1000/- (Ongoing) at cets.apsche.ap.gov.in

ఏ ప్రాంతాల్లోని స్కూళ్లకు సెలవు ఉండే అవకాశం ఉంటుంది :

ముఖ్యంగా

  1. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలోని స్కూళ్లకు సెలవు ఉంటుంది
  2. ఎన్నికల భద్రత ఏర్పాట్లు చేయవలసిన జిల్లాల్లోని స్కూళ్లకు సెలవు ఉంటుంది.

విద్యార్థులకు ముఖ్య సూచనలు:

  • విద్యార్థులు మరియు తల్లిదండ్రులు సెలవుల వివరాలను స్కూల్ హెడ్మాస్టర్ లేదా స్కూల్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకోవాలి.
  • హాలిడేస్ లో పిల్లలు హోంవర్క్ చేసేలాగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి
  • స్కూల్ హాలిడేస్ పూర్తయిన తర్వాత మళ్లీ ప్రారంభించినప్పుడు పిల్లలను స్కూలుకు పంపించాలి

స్కూల్ సెలవుల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.

ఏపీ 10th, ఇంటర్ పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP 10th & Inter Exams Postponed – New Exam Dates – Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page