AP Thalliki Vandanam scheme 2026:
ఆంధ్రప్రదేశ్లో స్కూల్ కి వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ” తల్లికి వందనం పథకం ” (Thalliki Vandanam scheme 2026) పథకానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు సంబంధించి అన్ని చర్యలను వేగవంతం చేసినట్లు సమాచారం. జూలై 24న జరగనున్న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (ptm) కు ముందే అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం తొలి విడతలో సుమారు 66.9 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం దాదాపు 10,049 నిధులకు పరిపాలన అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి విద్యార్థికి ₹13000/- చొప్పున వారి ఖాతాలో నేరుగా జమ చేయనున్నారు. అదనంగా ప్రతి విద్యార్థికి ₹2000/- చొప్పున పాఠశాల నిర్వహణ ఖర్చులకోసం కేటాయించనున్నారు.
అయితే, ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల వివరాల నమోదు ఇంకా కొనసాగుతున్నందున, వారికి సంబంధించిన నిధులను కూడా రెండవ విడతలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అధికారులు ప్రస్తుతం అర్హుల జాబితా ప్రక్రియను వేగవంతం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇదిలా ఉండగా జూలై 24వ తేదీన మెగా పేరెంటు టీచర్ మీటింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తల్లికి వందనం పథకం అర్హుల జాబితా ఇలా చెక్ చేసుకోండి?:
తల్లికి వందనం పథకం 2026 అర్హుల జాబితాను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీ మొబైల్ లోనే ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా అధికారిక gsws/NBM పోర్టల్ ను ఓపెన్ చేయండి
- https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్సైటులోకి వెళ్ళండి.
- హోం పేజీలో schem eligibility / Application Status ఆప్షన్ పై క్లిక్ చేయండి
- స్కీం వద్ద తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకోండి
- అకాడమిక్ ఇయర్ వద్ద 2026-27 ను సెలెక్ట్ చేసుకోండి
- తల్లి లేదా సంరక్షకురాలి ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేయండి
- స్క్రీన్ పైన కనిపించే క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి.
- ఆధార్ నంబర్కు లింక్ అయినా మొబైల్ నెంబర్ కి వచ్చే ఓటిపిని ఎంటర్ చేయండి
- OTP వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే స్క్రీన్ పైన మీరు ఈ పథకానికి అర్హులు అయితే Eligible అని, అర్హులు కాకపోతే Not Eligible అని చూపిస్తుంది
- నిధులు మంజూరు స్థితి, డబ్బులు లబ్ధిదారుని ఖాతాలో జమ అయ్యాయా లేదా అనేది చూపిస్తుంది.
Eligible స్టేటస్ లో మీ పేరు లేకపోతే ఏమి చేయాలి?:
తల్లికి వందనం పథకం ఎలిజిబుల్ స్టేటస్ లో పేరు లేని లబ్ధిదారులు ఈ క్రింది విధంగా ప్రయత్నం చేయండి, మీకు కూడా డబ్బులు జమ అవుతాయి.
- అర్హత ఉన్నప్పటికీ లిస్టులో పేరు కనిపించకపోతే, మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించి ఎలిజిబుల్ డేటా లో మీ పేరు సవరించుకోవచ్చు.
- నిధులు పొందడానికి కావలసిన సర్టిఫికెట్లను సబ్మిట్ చేసిన తర్వాత అధికారులు అన్ని వివరాలు పరిశీలించి, ధ్రువీకరించిన తర్వాత అర్హుల జాబితాలో మీ పేరు చేర్చే అవకాశం ఉంటుంది.
తల్లికి వందనం తాజా సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని సందర్శించండి