తల్లికి వందనం పధకం 2026 డబ్బులు విడుదల చేసే తేదీలు వచ్చేశాయి | Thalliki Vandanam Scheme 2026 Eligibility List, Check Your status Now

By: Sivakrishna Bandela

On: July 9, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Thalliki Vandanam Scheme 2026:

ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేటువంటి విద్యార్థిని మరియు విద్యార్థులకు, వారి చదువులకు అయ్యేటువంటి ఖర్చులను భరించేందుకుగాను విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో ప్రతి విద్యార్థికి ₹15,000/- రూపాయల చొప్పున జమ చేసి, ఆ డబ్బులను విద్యార్థుల చదువులకు ఉపయోగించే విధంగా ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం “తల్లికి వందనం పథకం”. 2026 సంవత్సరానికి గాను ఈ పథకం డబ్బులను జూలై 16, 17, 18 తేదీలలో విద్యాశాఖ నిర్వహించబోయే పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా ₹15,000/- డబ్బులను సంబంధిత విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల తెలియజేశారు. ఈ మూడు రోజులపాటు తల్లుల యొక్క ఖాతాల్లో డబ్బులను జమ చేసి రెండో విడత ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేసే తేదీలు:

తల్లికి వందనం పథకం 2026 సంవత్సరానికి సంబంధించిన ₹15,000/- రూపాయలను జూలై 16, 17, 18 తేదీలలో పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఈ మూడు తేదీలలో తల్లుల ఖాతాల్లో, ఆ తల్లి యొక్క ప్రతి విద్యార్థికి ₹15,000/- రూపాయల చొప్పున ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కలిపి ఆ తల్లి యొక్క బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈ మూడు తేదీలలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలియజేశాడు.

ఏపీ తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల తేదీ ఇదే | AP Thalliki Vandanam Release Date 2026 | Freejobsintelugu
  • పథకం పేరు: తల్లికి వందనం
  • ప్రతి విద్యార్థికి చెల్లించే నగదు : ₹15,000/-
  • తల్లి ఖాతాలో జమ అయ్యే నగదు : ₹13,000/-
  • స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసే నగదు : ₹2,000/-

Thalliki Vandanam scheme eligibility list:

తల్లికి వందనం పథకం 2026 లబ్ధిదారుల లిస్ట్ ఇటీవల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.

  1. మీరు ఈ పథకానికి అర్హులా కాదా తెలుసుకునేందుకు ముందుగా మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి.
  2. సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించి, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అడిగి తెలుసుకోవాలి.
  3. అలాగే సచివాలయంలోని నోటీస్ బోర్డ్ లో లబ్ధిదారుల జాబితా లిస్ట్ ఉంటుంది. అక్కడ మీ పేరు ఉందో లేదో సరి చూసుకోవాలి
  4. పేరు లేని లబ్ధిదారులు వారి పేరు ఎందుకు లేదో తెలుసుకొని కావలసినటువంటి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయవలెను.
  5. eligible అని లబ్ధిదారుల జాబితాలో ఉన్నవారికి జూలై 16, 17, 18 తేదీలలో తల్లుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి.

ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:

తల్లికి వందనం పథకం 2026-27 సంవత్సరానికి గాను లబ్ధిదారులు వారి యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఆన్లైన్లో ఫాలో అవ్వండి. మీరు ఈ పథకానికి అర్హులా కాదా తెలుసుకోవచ్చు.

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.
  • ముందుగా తల్లికి వందనం పథకం అధికారిక వెబ్సైట్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout లోకి వెళ్లండి
  • వెబ్సైట్లో లబ్ధిదారుల యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, తల్లికి వందనం పథకం స్కీం ఎంపిక చేసి, 2026-27 సంవత్సరాన్ని ఎంపిక చేసిన తర్వాత, Get Details ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే
  • మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా స్క్రీన్ పైన కనిపిస్తుంది
  • ఎలిజిబుల్ అని చూపించినట్లయితే మీకు ఈ పథకంకి సంబంధించిన డబ్బులు సంబంధిత తేదీలలో జమ అవుతాయి

Thalliki Vandanam Scheme Website

తల్లికి వందనం పథకం 2026 సంవత్సరానికి సంబంధించిన తాజా సమాచారం కోసం ప్రతి రోజూ మా వెబ్సైట్ని సందర్శించండి.

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page