AP, TS Schools Holidays In January 2026:
2026 జనవరిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో స్కూల్ విద్యార్థులకు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 10 రోజులు సెలవులు ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకు అలాగే కళాశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాధికారులు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైనది మరియు కుటుంబం మొత్తం కలిసి జరుపుకునే గొప్ప పండుగగా కీర్తించబడింది. జనవరి 11వ తేదీ నుండి 18 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు. దానితోపాటు జనవరి 25 ఆదివారం, జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మరొక రెండు రోజులు సెలవులు రానున్నాయి. మొత్తం పది రోజులపాటు సెలవులు రావడంతో స్కూల్ విద్యార్థులు, కళాశాల విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.
AP, TS స్కూల్స్ మరియు కళాశాలలకు సెలవు దినాల ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పండుగల సందర్భంగా సెలవులో ప్రకటించారు ఆ తేదీలను ఈ క్రింది లిస్ట్ ద్వారా చూసి తెలుసుకోండి.
- సంక్రాంతి సెలవులు ప్రారంభ తేదీ: 11th జనవరి, 2026
- సంక్రాంతి సెలవులు ముగిసే తేదీ: 18th జనవరి, 2026
- రిపబ్లిక్ డే మరియు ఆదివారం సెలవు: జనవరి 25, 26 – 2026
- మొత్తం 10 రోజులు సెలవులు వరుసగా జనవరి నెలలో రానున్నాయి.
సంక్రాంతి దినాల అర్థం మరియు సెలవుల వివరాలు :
సంక్రాంతి అనగా,
- భోగి : పాత పనులు తొలగించే కొత్త ఆరంభం.
- సంక్రాంతి ( మకర సంక్రమణ ) : సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర దినం
- కనుమ: పశుపోషణ దినం – మిగిలిన కుటుంబంతో పండుగ వేడుకలు.
- ఈ మూడు రోజులు పండుగ సెలవులు అధికారికంగా ఉంటాయి. మిగిలిన రోజుల ప్రభుత్వం తెలిపిన డేట్స్ ప్రకారం సెలవులు ఉన్నాయి.
ఏపీ, తెలంగాణ లో సెలవులు అధికారంగా ప్రకటించారా:
అవును ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు సంక్రాంతి మరియు రిపబ్లిక్ డే సందర్భంగా సెలవులు అధికారికంగా ప్రకటించాయి. ఇది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి సెలవులు కావున ప్రత్యేకంగా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు.
విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు ముఖ్య సూచనలు:
పండుగ సెలవుల సందర్భంలో పిల్లలు చక్కగా ఆడుకునే విధంగా తల్లిదండ్రులు వారికి అవకాశం కల్పించాలి.
- అలాగే, పండుగ రోజుల్లో కూడా వాళ్ళు విద్యను దూరంగా పెట్టకుండా రోజు కనీసం ఒక గంట సేపైనా వారికి చదువు నేర్పించాలి.
- సెలవులు పూర్తయిన వెంటనే పిల్లలను స్కూల్ కి పంపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
- స్కూల్ యాజమాన్యానికి సంప్రదించి, సెలవుల తర్వాత మళ్లీ స్కూల్స్ ఎప్పుడు పునః ప్రారంభం కానున్నాయో తెలుసుకోవాలి.
ఇలాంటి అధికారిక సెలవుల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.