స్కూల్ విద్యార్థులకు ₹12,000/- స్కాలర్షిప్: అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు

By: Sivakrishna Bandela

On: July 15, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NMMS Scholarships 2025:

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (National Means Cum Merit Scholarship) స్కీమ్ కి సంబంధించిన తాజా నోటిఫికేషన్ జూన్ 2, 2025 అధికారికంగా విడుదల చేశారు. 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ స్కాలర్షిప్స్ కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ స్కాలర్షిప్ పరీక్ష రాసి,ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వరకు అనగా (12వ తరగతి) వరకు సంవత్సరానికి ₹12,000 రూపాయలు స్కాలర్షిప్స్ విద్యార్థి యొక్క అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. అయితే ఈ స్కాలర్షిప్స్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, రాత పరీక్ష ఎలా ఉంటుందనేటువంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

Join WhatsApp Group

ఏపీ తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల తేదీ ఇదే | AP Thalliki Vandanam Release Date 2026 | Freejobsintelugu
అంశము తేదీలు
NMMS నోటిఫికేషన్ విడుదల తేదీ జూన్ 2, 2025
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీజూన్ 2, 2025
దరఖాస్తు ప్రక్రియ ఆఖరి తేదీ ఆగస్టు 31, 2025
లోపాలు సరి చేసే సమయంసెప్టెంబర్ 15, 2025
విద్యార్థి యొక్క అర్హత ధ్రువీకరణ చేసే తేదీ సెప్టెంబర్ 30, 2025

స్కాలర్షిప్ లక్ష్యాలు మరియు అమలుచేసే విధానం:

  • ప్రధాన ఉద్దేశం: పాఠశాలలో 8వ తరగతి తర్వాత విద్యార్థులు తమ యొక్క విద్యను కొనసాగించేందుకుగాను, వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ స్కాలర్షిప్స్ ని ప్రారంభించారు.
  • కుటుంబం యొక్క వార్షిక ఆదాయం మూడు లక్షల 50 వేలు లేదా అంతకంటే తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్ కి అర్హులు.
  • ప్రభుత్వం / సహకారం పొందే పాఠశాలల్లో చదువుతున్నటువంటి 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను క్లాస్ డ్రాప్ అవుట్ కాకుండా చేసేందుకు ఈ పథకాన్ని రూపొందించారు.
  • 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంవత్సరానికి ₹12,000/- స్కాలర్షిప్ విద్యార్థి యొక్క బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు.

తెలంగాణ పాలిసెట్ 2025 సీట్ అలాట్మెంట్ ఆలస్యానికి గల కారణాలు

అర్హతలు:

  1. 7వ తరగతిలో 55 శాతం మార్కులతో పాన్సైన విద్యార్థులు. (SC /ST విద్యార్థులకు 50 శాతం మార్కులు వస్తే చాలు).
  2. 8వ తరగతి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
  3. విద్యార్థి యొక్క కుటుంబ వార్షిక ఆదాయం 3,50,000 కంటే తక్కువ ఉండాలి.
  4. KVS, NVS, సైనిక్ స్కూల్ విద్యార్థులు అర్హులు కాదు.

స్కాలర్షిప్ ఎంత మొత్తం చెల్లిస్తారు?:

  • NMMS స్కాలర్షిప్స్ కి రాత పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు, 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సంవత్సరానికి ₹12,000/- ప్రతి సంవత్సరం చెల్లిస్తారు.
  • చెల్లింపు విధానం PFMS ద్వారా విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది.

NMMS స్కాలర్షిప్ పరీక్ష విధానం?:

  1. MAT ( mental ability test) : రీజనింగ్ మరియు క్రిటికల్ థింకింగ్ టెస్ట్ నుంచి 90 ప్రశ్నలు, 90 నిమిషాలు నిర్వహిస్తారు.
  2. SAT ( scholarship aptitude test ): సైన్స్, మాథ్స్, సోషల్ సైన్స్ టాపిక్స్ నుంచి 90 ప్రశ్నలు, 90 నిమిషాలు నిర్వహిస్తారు.
  3. కేటగిరీల వారిగా అర్హత మార్కులు : జనరల్ గ్రూపు విద్యార్థులకు 40%, SC, ST విద్యార్థులకు 32% ప్రతి పేపర్లోనూ రావాలి.

దరఖాస్తు చేసుకునే విధానం:

  1. ముందుగా NSP OTR నమోదు చేసుకోవాలి – National scholarship portal లో వన్ టైం రిజిస్ట్రేషన్(OTR) నమోదు చేయాలి.
  2. ఫ్రెష్ లేదా రెన్యూవల్ దరఖాస్తులను జూన్ 2 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు చేసుకోవాలి.
  3. విద్యార్థుల యొక్క పూర్తి వివరాలను రిజిస్ట్రేషన్ ఫారంలో నింపి, ఎటువంటి తప్పులు లేకుండా దరఖాస్తులను సబ్మిట్ చేయాలి.
  4. ఆదాయ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్స్,స్కూల్ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం వంటి పలు రకాల సర్టిఫికెట్ల వివరాలను అప్లికేషన్లో పూరించాలి.

NMMS Scholarship Official Website

తల్లికి వందనం పధకం 2026 డబ్బులు విడుదల చేసే తేదీలు వచ్చేశాయి | Thalliki Vandanam Scheme 2026 Eligibility List, Check Your status Now

రెన్యువల్ నిబంధనలు:

  1. ఈ స్కాలర్షిప్స్ ని 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇస్తున్నందున, ప్రతి సంవత్సరపు తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి.
  2. 9వ తరగతి నుండి పదవ తరగతికి వెళ్లేటువంటి విద్యార్థులు, ఆ తరగతిలో పాస్ అయి ఉండాలి
  3. క్లాస్ 11/12 ముందు 10వ తరగతిలో కనీసం 60%, SC, ST విద్యార్థులకు 55% మార్కులతో తిన్నతో పొంది ఉండాలి.

కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ₹12,000/- స్కాలర్షిప్ కోసం ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోండి.

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page