తల్లికి వందనం పథకం 2వ జాబితా సిద్ధం: గ్రీవెన్స్ పెట్టినవాళ్లలో చాలా మందికి Eligible వచ్చింది-మీ పేరు ఇలా చూసుకోండి

By: Sivakrishna Bandela

On: July 4, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Thalliki Vandanam Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ తల్లికి వందనం పథకం 2025 కి సంబంధించి గ్రీవెన్స్ ( అభ్యంతరాలు) పెట్టుకున్న వారికి శుభవార్త. జూన్ 12వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు డబ్బులు పడని తల్లులు అభ్యంతరాలు పెట్టుకున్న వారి యొక్క గ్రీవెన్స్ పత్రాలను పరిశీలించిన అధికారులు, వారిలో చాలామంది లబ్ధిదారులను తల్లికి వందనం పథకానికి “Eligible” గా పరిగణిస్తూ రెండవ జాబితా ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబితాలో మీరు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మీకు మూడు మార్గాలు ఉన్నాయి. ఆ మూడు మార్గాలు ఏమిటి మీరు ఏ విధంగా మీ యొక్క రెండవ జాబితా లిస్ట్ ని చెక్ చేసుకోవచ్చో ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తల్లికి వందనం పథకం 2వ జాబితా సిద్ధం చేశారు:

తల్లికి వందనం పథకం మొదటి విడతలో డబ్బులు పడని లబ్ధిదారులు, ఎవరైతే అభ్యంతరాలను ( గ్రీవెన్స్) పెట్టుకున్నారో వారి యొక్క పత్రాలను పరిశీలించిన గ్రామ సచివాలయం అధికారులు, చాలామంది లబ్ధిదారులను అర్హులుగా (ELIGIBLE )పరిగణిస్తూ రెండవ జాబితాని సిద్ధం చేశారు. ఈ రెండవ జాబితాలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు జూలై 5వ తేదీన ₹13,000/- చొప్పున స్కూల్ కి వెళ్లే ప్రతి విద్యార్థికి, విద్యార్థి యొక్క తల్లి అకౌంట్ లో నగదు డిపాజిట్ చేయనున్నారు.

ఏపీ తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల తేదీ ఇదే | AP Thalliki Vandanam Release Date 2026 | Freejobsintelugu

Join WhatsApp group

2వ జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి మీకు 3 మార్గాలు ఉన్నాయి:

మీరు తల్లికి వందనం పథకానికి అర్హులై మొదటి విడతలో డబ్బులు డిపాజిట్ కాని వారు అయితే, రెండవ విడతలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ క్రింది విధానాలను అనుసరించడం ద్వారా మీ పేరు చెక్ చేసుకోవచ్చు. అవి ఏమనగా

తల్లికి వందనం పధకం 2026 డబ్బులు విడుదల చేసే తేదీలు వచ్చేశాయి | Thalliki Vandanam Scheme 2026 Eligibility List, Check Your status Now
  1. వాట్సాప్ మన మిత్ర సేవల ద్వారా:
    • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన “మనమిత్ర వాట్సాప్ సర్వీసెస్ ” ద్వారా తల్లికి వందనం పథకానికి అర్హులా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు.
    • ముందుగా మనమిత్ర వాట్సాప్ నంబర్ “+91 95523 00009” మొబైల్ లో సేవ్ చేసుకొని హాయ్ అని మెసేజ్ చేయండి.
    • అక్కడ సేవలను ఎంచుకోండి అని ఆప్షన్ చేయండి.
    • తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకోండి. లబ్ధిదారుని యొక్క 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
    • వెంటనే స్క్రీన్ పైన మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది.
  2. రెండో విధానం: వెబ్సైట్ ద్వారా:-
    • తల్లికి వందనం పధకం రెండవ విడత జాబితా అర్హత స్టేటస్ చెక్ చేసుకోవడానికి ముందుగా ఈ వెబ్సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP ఓపెన్ చేయండి
    • అక్కడ తల్లికి వందనం పథకాన్ని ముందుగా ఎంపిక చేసుకొని, 2025-26 సంవత్సరాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, లబ్ధిదారుని యొక్క ఆధార్ కార్డు నెంబర్ (UID) ఎంటర్ చేయండి
    • తర్వాత Get OTP పై క్లిక్ చేసిన వెంటనే మీకు మెసేజ్ రూపంలో ఓటిపి వస్తుంది అది ఎంటర్ చేసే సబ్మిట్ చేయండి.
    • స్క్రీన్ పైన మీరు ఈ పథకానికి అర్హులా కాదా అనేది చూపిస్తుంది. ELIGIBLE /OPEN/CLOSE ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి.
  3. గ్రామ సచివాలయం ద్వారా 2వ జాబితా చూసుకోండి:
    • ఆన్లైన్ విధానంలో స్టేటస్ చెక్ చేసుకోలేని వారు, మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ని సంప్రదించి రెండవ జాబితా లిస్ట్ చెక్ చేసుకోండి
    • ఆ రెండవ జాబితా లిస్టులో మీ పేరు ఉండి మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అని ఉన్నట్లయితే, మీకు జూలై 5వ తేదీన ₹13,000/- అకౌంట్లో నేరుగా డబ్బులు డిపాజిట్ అవుతాయి.

ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు: Official

₹13,000/- ఎప్పుడు డిపాజిట్ అవుతాయి?:

తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారుల తల్లుల ఎకౌంట్లో జూలై 5వ తేదీన ₹13,000/- డిపాజిట్ అవుతాయి. డిపాజిట్ అయిన వెంటనే మీకు ఎస్ఎంఎస్ రూపంలో మెసేజ్ వస్తుంది. మీ అకౌంట్లో ఉన్న టోటల్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని, మీకు డబ్బులు డిపాజిట్ అయ్యాయా లేదా అనేది వెరిఫై చేసుకోవచ్చు.

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

రెండవ విడత జాబితాలో పేరు లేని వారి పరిస్థితి ఏమిటి?:

తల్లికి వందనం పథకం రెండవ విడత జాబితాలో పేరు లేనివారు, మరో విడత జాబితా వచ్చేంతవరకు వేచి ఉండాల్సిందే. లేదా మరుసటి సంవత్సరంలో కూడా ఇదే పథకాన్ని అమలు చేస్తారు కాబట్టి, లబ్ధిదారులు ఈసారి సరైనటువంటి పత్రాలను సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page