TS 10th supplementary exams 2025:
తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షను జూన్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు, పరీక్ష పత్రాలు మూల్యాంకనంలో నిమగ్నమై ఉన్నారు. అయితే ఈ పరీక్ష ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తారని దానికి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ గత సంవత్సరాల్లో వచ్చినటువంటి ఫలితాలు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ మూడో వారం లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024లో జూన్ 27న సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. 2023లో అయితే జూలై 7న ఫలితాలు విడుదల చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం జూన్ నెల చివరి వారంలోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫలితాలు విడుదలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.
ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?:
తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ మూడో వారం లేదా నాలుగో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. పరీక్ష రాసింది చాలా తక్కువ మంది అభ్యర్థులైనప్పటికీ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన తర్వాత ఈ నెలలోనే ఫలితాన్ని విడుదల చేయడానికి అధికారులు అన్ని విధాలుగా సన్నాహాలు చేస్తున్నారు.
వెబ్సైట్లో ఫలితాలు ఎలా చూసుకోవాలి?:
పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో రాసిన విద్యార్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వడం ద్వారా రిజల్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ రైతు భరోసా పథకం డబ్బులు డిపాజిట్ కాని వారు రేపట్లోగా మళ్లీ అప్లై చేయాలి: Apply Link
- ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ https://bse.telangana.gov.in/ ఓపెన్ చేయండి.
- వెబ్సైట్ హోం పేజీలో ” TS 10th supplementary exams 2025 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి. అవి ప్రింట్ అవుట్ తీసుకోండి
TGBSE 10th Results Website Link
FAQ’s:
1. తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?
జూన్ మూడవ వారం లేదా నాలుగవ వారంలో ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది
2. తెలంగాణ పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు నిర్వహించారు?
జూన్ మూడవ తేదీ నుండి జూన్ 13వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు సెంటర్లలో నిర్వహించారు.