తెలంగాణ రైతు భరోసా పథకం ₹12,000/- విడుదల తేదీ వచ్చేసింది: వెంటనే మీ పేరు ఉందేమో చెక్ చేసుకోండి

By: Sivakrishna Bandela

On: May 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana rythu Bharosa scheme 2025:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం Telangana Rythu Bharosa Scheme 2025) ₹12 వేల డబ్బులను మరో 10 రోజుల్లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలోని చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకం ద్వారా అర్హత పొందినటువంటి రైతులకు ఖరీఫ్ మరియు రబీ సీజన్లకు కలిపి ₹12000 వరకు ఆర్థిక సహాయం అందనుంది. ఇప్పుడు ఆ డబ్బులను నేరుగా రైతుల ఖాతాలో విడుదల చేయడానికి జూన్ ఆరో తేదీ నుండి 10వ తేదీ మధ్యన విడుదల చేయనున్నట్లు తెలిపారు.

రైతు భరోసా డబ్బులు విడుదల చేసే తాజా సమాచారం:

2025 మే 28వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 3.5 ఎకరాల భూమి కలిగిన రైతులకు మాత్రమే రైతు భరోసా సాయం అందిందని, అయితే మరో పది రోజుల్లో నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి కలిగినటువంటి వారికి కూడా రైతు భరోసా డబ్బులు జమ చేయడం జరుగుతుంది అని మంత్రి తెలిపారు.

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

Join Whats App Group

రైతు భరోసా పథకం అర్హతలు:

  • వయస్సు: 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న రైతులై ఉండాలి
  • భూమి : ధరణి పోర్టల్లో నమోదై ఉండి, వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి కలిగి ఉండాలి
  • పట్టాదారులు: RoFR ( recognition of forest rights ) పట్టాదారులు కూడా అర్హులు
  • అర్హత లేని భూములు : వాణిజ్య మరియు రియల్ ఎస్టేట్, మైనింగ్ మరియు పరిశ్రమల కోసం ఉపయోగించే భూములు.
  • ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వారు ఈ పథకానికి అనర్హులు.

దరఖాస్తు ప్రక్రియ:

  • గతంలో ప్రభుత్వం నుండి రైతు భరోసా పథకం డబ్బులు పొందిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు వారి యొక్క డేటా ప్రభుత్వం వద్ద ఉన్నది.

అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది : Click Here

ఏపీలో 10.42 లక్షల ఇళ్ళ మంజూరు – లబ్ధిదారుల జాబితా విడుదల | AP PMAY Gramin 2.0 Beneficiary List 2026 | Check Full Details

కొత్తగా దరఖాస్తు చేయదలచిన రైతులు:

  • దరఖాస్తు ఫారం పొందడం ఎలా?: మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా క్లస్టర్ అధికారులు సంప్రదించి దరఖాస్తు ఫారం ని తీసుకోవాలి
  • ఫారం నింపడం: రైతు యొక్క వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు, భూమి వివరాలు ఫారంలో నమోదు చేయాలి.
  • అవసరమైన సర్టిఫికెట్స్ :
  • పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్
  • బ్యాంకు పాస్బుక్ జిరాక్స్
  • ఆధార్ కార్డు జిరాక్స్
  • ఎవరికి సమర్పించాలి : పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారంను మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారికి సబ్మిట్ చేయాలి.

స్టేటస్ చెక్ చేయడం ఎలా?:

  1. ముందుగా రైతు భరోసా అధికారిక వెబ్సైట్ https://www.rythubharosa.telangana.gov.in/Login.aspx ఓపెన్ చేయండి.
  2. లాగిన్ వివరాలు : మీ మొబైల్ నెంబర్ ద్వారా ఓటిపి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
  3. స్టేటస్ పరిశీలన: రైతు యొక్క దరఖాస్తు స్థితి మరియు చెల్లింపు వివరాలను పరిశీలించండి

Rythu Bharosa Official Website

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

ఈ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు పెట్టుబడి భారం తగ్గి వ్యవసాయ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఈ పథకం ద్వారా స్పష్టమవుతుంది.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page