అన్నదాత సుఖీభవ పథకం 2025 ప్రారంభ తేదీ వచ్చేసింది: రైతుల అకౌంట్లో ₹20,000/- వేస్తారు: కావలసిన సర్టిఫికెట్స్, ఎలా అప్లై చేయాలి?

By: Sivakrishna Bandela

On: May 29, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP అన్నదాత సుఖీభవ పథకం 2025:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024 ఎన్నికల హామీల్లో ఒకటైనటువంటి అన్నదాత సుఖీభవ పథకాన్ని (Annadatha Sukhibhava PM Kisan Scheme 2025) ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తోంది. రైతుల సంక్షేమం కోరి అర్హులైన రైతుల అకౌంటుల్లో ₹20,000/- డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీ ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ పథకానికి రైతులకు ఉండవలసిన అర్హతలు, కావలసిన, సర్టిఫికెట్స్ ఎలా అప్లై చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

పథకానికి కావలసిన అర్హతలు:

Join Whats App Group

ఏపీ తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల తేదీ ఇదే | AP Thalliki Vandanam Release Date 2026 | Freejobsintelugu
  • రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి
  • ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులు అర్హులు.
  • వయసు 18 సంవత్సరాలు నిండిన వారై ఉండాలి
  • భూమికి సంబంధించిన పక్కా పత్రాలు మరియు పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉండాలి.
  • రైతు పేరు ఆధార్ తో అనుసంధానమై ఉండాలి
  • రైతు పండించే పంటలు వివరాలు నమోదు చేయాలి.
  • భూమిని లీజుకు తీసుకున్న కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు కాబట్టి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

పథకానికి ఎవరు అనర్హులు:

తల్లికి వందనం పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది : వెంటనే అప్లై చేయండి

  • ఆదాయపు పన్ను అనగా ఇన్కమ్ టాక్స్ చెల్లించేవారు అనర్హులు
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు
  • ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు
  • ₹10వేలు, అంతకంటే ఎక్కువ పింఛన్ పొందేవారు
  • ఒకే కుటుంబంలో ఇద్దరు నుంచి నలుగురు పేరిట భూమి ఉంటే వారిలో ఒకరికి మాత్రమే పథకం వస్తుంది.

అవసరమైన ధ్రువపత్రాలు:

  • రైతు ఆధార్ కార్డ్
  • భూమి యొక్క పట్టాదారు పాసుపుస్తకం
  • రైతు యొక్క బ్యాంకు పాస్ బుక్
  • మొబైల్ నెంబర్
  • భూమి యొక్క వివరాలు అనగా సర్వేనెంబర్
  • రైతు యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
  • ఆధార్ కార్డు నెంబర్ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి

దరఖాస్తు చేసుకునే విధానం:

  1. అర్హులైన రైతులు తమ యొక్క ఆధార్ కార్డ్, బ్యాంకు పాస్ బుక్, పట్టాదారు పాసుపుస్తకం వివరాలతో రైతు భరోసా కేంద్రాల్లో అధికారులను సంప్రదించాలి
  2. అక్కడి సిబ్బందికి రైతులు వివరాలు అందించాలి
  3. సిబ్బంది ఆ రైతు యొక్క పూర్తి వివరాలు చూసి అర్హుడా కాదా అనేది తేల్చిన తర్వాత వారి యొక్క పేరును నమోదు చేయాలి
  4. ఈ పథకం కింద పెట్టుబడి సాయంగా ఇచ్చేటువంటి నిధులు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానం ద్వారా మూడు విడతలుగా రైతు యొక్క ఖాతాలో జమ అవుతాయి.

మొత్తం సాయం వివరాలు:

  • ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా : ₹6,000/-
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నుండి అదనంగా : ₹14,000/-
  • మొత్తం: ₹20,000/-

జూన్ 12వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని మళ్లీ పునః ప్రారంభించే అవకాశం ఉన్నందున, అర్హులైన రైతులు పైన తెలిపినటువంటి వివరాలను ఆధారంగా చేసుకొని అన్ని సర్టిఫికెట్లు రెడీ చేసుకోండి.

తల్లికి వందనం పధకం 2026 డబ్బులు విడుదల చేసే తేదీలు వచ్చేశాయి | Thalliki Vandanam Scheme 2026 Eligibility List, Check Your status Now

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:

  1. అధికారిక వెబ్సైట్ https://annadathasukhibhava.ap.gov.in ఓపెన్ చేయండి
  2. know your status ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. మీ ఆధార్ కార్డు నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, స్క్రీన్ పై కనిపిస్తున్న కాప్చ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే, రైతు దరఖాస్తుకు సంబంధించిన స్టేటస్ చూపిస్తుంది.

ఈ పథకం ప్రభుత్వం సూచించిన విధివిధానాలపై ఆధారపడి ఉంటుంది. కాలానుగుణంగా పథకంలో మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది కావున రైతులు గమనించగలరు.

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page