తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదల : వెంటనే అప్లై చేయండి

By: Sivakrishna Bandela

On: May 1, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana DOST Notification 2025:

తెలంగాణలోన డిగ్రీ కోర్సుల్లో జాయిన్ అవ్వడం కోసం ఎదురుచూస్తున్న ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దోస్త్ (Degree Online Services Telangana – DOST) నోటిఫికేషన్ ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.2025-26 అడ్మిషన్లకి సంబంధించిన షెడ్యూల్, వెబ్ ఆప్షన్లు, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోగలరు.

దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసే తేదీ:

  • నోటిఫికేషన్ రిలీజ్ డేట్: మే 2nd, 2025
  • మొదటి దశ వెబ్ ఆప్షన్స్ ప్రారంభమయ్యేది: మే 6 నుంచి మొదలవుతాయి

దోస్త్ అడ్మిషన్స్ పూర్తి షెడ్యూల్:

  • ఫేస్ 1 వెబ్ ఆప్షన్స్ : మే 6 నుండి మొదలు
  • ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ : ఫస్ట్ ఫేజ్ డేట్స్ పూర్తయిన తర్వాత సెకండ్ ఫేజ్ డేట్స్ ఇస్తారు
  • ఫేజ్ 3 వెబ్ ఆప్షన్స్ : సెకండ్ ఫేజ్ పూర్తయిన తర్వాత థర్డ్ ఫేజ్ డేట్స్ ఇస్తారు.
  • ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేస్తారు: ఈ వెరిఫికేషన్ పేజ్ ఆధారంగా చేయడం జరుగుతుంది

మొత్తం ఎన్ని లక్షల సీట్స్ ఉంటాయి:

తెలంగాణలో గుర్తింపు పొందిన డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్స్ లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకు దాదాపుగా 4 లక్షల వరకు సీట్స్ ఖాళీగా ఉంటాయి. దోస్తు నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం విడుదల చేసి ఈ ఖాళీలను పూరిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయినందున దోస్తు నోటిఫికేషన్ మే రెండవ తేదీన విడుదల చేసి ఫేసుల వారీగా అడ్మిషన్స్ ప్రారంభించడం జరుగుతుంది.

Join Whats App Group

మొత్తం కాలేజీలు, ఆఫర్ చేసే కోర్సులు:

తెలంగాణలో ఇంటర్ నుండి డిగ్రీలో జాయిన్ అవ్వాలి అనుకునే విద్యార్థుల కోసం మొత్తం 978 డిగ్రీ కళాశాలలో అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో 510 కోర్సుల్ని ఆఫర్ చేస్తున్నారు. బిఎస్సి బిఏ బీకాం బీ జెడ్ సి, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బిఎస్సి ఇంజనీరింగ్ డీఎస్సీ మ్యాథ్స్ లాంటి చాలా రకాల కోర్స్ ని ఆఫర్ చేయడం జరుగుతుంది.

ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదలైంది – ఇలా దరఖాస్తులు చేసుకోండి. | inter admissions 2026 started

తెలంగాణా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల

దోస్త్ అడ్మిషన్స్ కు కావలసిన డాక్యుమెంట్స్ :

డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి

  1. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
  2. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి
  3. కుల ధ్రువీకరణ పత్రము
  4. ఇన్కమ్ సర్టిఫికెట్
  5. ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్
  6. బ్యాంకు పాస్ బుక్

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

దోస్త్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

  • ముందుగా అధికారిక వెబ్సైట్ https://dost.cgg.gov.in/ ఓపెన్ చేయండి
  • విద్యార్థుల యొక్క పూర్తి వివరాలు నమోదు చేసి ఆధార్ లింక్ చేయాలి
  • ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేయాలి
  • దోస్త్ ఫేస్ వన్ అప్లికేషన్ ఫీజు ₹200/- రూపాయలు పే చేయాలి.

తెలంగాణలో ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీ అడ్మిషన్స్ కోసం ప్రయత్నించేవారు కచ్చితంగా దోస్తు ద్వారానే అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా మొదటి పేజ్ లోనే మీకు సీట్ వచ్చే విధంగా వెంటనే దరఖాస్తులు పెట్టుకోగలరు. ఇతర రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ని సందర్శించండి.

AP ICET 2026 Application Last Date LIVE : Registration With Late FEE ₹1000/- (Ongoing) at cets.apsche.ap.gov.in

FAQ’s:

1. తెలంగాణ దోస్త్ నోటిఫికేషన్ 2025 ఎప్పుడు విడుదల చేస్తారు?

మే 2వ తేదీన దోస్తు నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేస్తారు

2. డిగ్రీ కళాశాలలో మొత్తం ఎన్ని లక్షల సీట్స్ ఉన్నాయి?

మొత్తం నాలుగు లక్షల వరకు డిగ్రీ మొదటి సంవత్సరంలో సీట్స్ అందుబాటులో ఉన్నాయి.

ఏపీ 10th, ఇంటర్ పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP 10th & Inter Exams Postponed – New Exam Dates – Full Details

3. దోస్త్ అడ్మిషన్స్ కు దరఖాస్తు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏది?

ఈ వెబ్సైట్ https://dost.cgg.gov.in/ ద్వారా తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ డిగ్రీ అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page