TS Inter Results 2026 Top Marks Scored Students List | TS Inter 2026 Toppers | Telangana Inter 2026 Top Rankers

By: Sivakrishna Bandela

On: April 13, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Inter 2026 Results Toppers List:

నిన్న ఏప్రిల్ 12 2026వ తేదీన తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు గారి చేతుల మీదుగా విడుదల చేశారు. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయిగా ఇందులో 9.5 లక్షల మంది విద్యార్థులు పాసయ్యారు. అయితే ఫలితాలు సాధించిన వారిలో మొదటి ఇంటర్మీడియట్ సంవత్సర విద్యార్థులలో MPC లో 470 మార్కులకు 469 మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు. అలాగే రెండు సంవత్సరాలు కలిపి MPC లో 1000 మార్కులకు 997 మార్కులతో సాయి శ్రేష్ఠిత అనే అమ్మాయి టాపర్ గా నిలిచింది. అలాగే BiPC లో కే. జ్యోత్స్న, హఫ్ఫాబేగం 1000 మార్కులకు 997 మార్కులతో టాపర్స్ గా నిలిచారు. నిన్న విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల్లో అత్యున్నతమైన ఉత్తీర్ణత మహిళా స్టూడెంట్స్ మాత్రమే సాధించారు.

ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సర Toppers వీళ్ళే:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షలలో బ్రాంచ్ల వారీగా టాప్ ర్యాంక్ లో నిలిచిన విద్యార్థుల యొక్క లిస్టు ఈ క్రింది విధంగా ఉంది.

CBSE 10th Results 2026 By April 14 | Check Results @cbse.gov.in | CBSE 10th 2026 Results OUT
  • MPC, BiPC ఫస్ట్ ఇయర్: మొదటి సంవత్సర ఇంటర్మీడియట్ పరీక్షల్లో 470కి 469 మార్కులు చాలామంది విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. రెండు బ్రాంచ్లలో చాలా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులు 469 మార్కులతో సత్తా చాటారు.
  • సెకండ్ ఇయర్ MPC, BiPC: రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల్లో 1000 కి 997 మార్కులతో MPC లో సాయి శ్రేష్ఠిత అనే అమ్మాయి టాపర్ గా నిలిచింది.
  • అలాగే సెకండ్ ఇయర్ BiPC లో 1000 కి 997 మార్కులతో హఫ్ఫా బేగం టాపర్గా నిలిచింది.
  • నా కుమార్లు తెచ్చుకున్న విద్యార్థులను ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు అభినందించారు.

రీకౌంటింగ్, రెవెరిఫికేషన్ డేట్స్ & ఫీజు వివరాలు:

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులకు వచ్చినటువంటి మార్కులను ఆధారంగా చేసుకుని కొంతమంది విద్యార్థులు రికౌంటింగ్ మరియు రివెరిఫికేషన్కు ఛాలెంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అలాంటి విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ ఏప్రిల్ 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కోసం సబ్జెక్టుల వారీగా ఫీజు చెల్లించాలి.

  • రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ డేట్స్: ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 20, 2026
  • రీకౌంటింగ్ కు ప్రతి సబ్జెక్టుకు ₹100/- చొప్పున ఫీజు చెల్లించాలి.
  • ఫ్రీ వెరిఫికేషన్కు ప్రతి సబ్జెక్టుకు ₹800/- చొప్పున ఫీజు చెల్లించాలి.
  • Recounting & Reverification Apply Online Website: Click Here

విద్యార్థులకు మార్కులు తక్కువగా వచ్చాయని భావించినట్లయితే వారు తప్పనిసరిగా రీకౌంటింగ్ మరియు వెరిఫికేషన్ కి దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించండి.

TS ఇంటర్ 2026 రీకౌంటింగ్ VS రీ వెరిఫికేషన్ – ఇందులో ఏది బెటర్ | TS Inter Results 2026 Recounting VS Reverification – Which One is better?

Postal GDS 2026 3rd Merit List Release Date | Postal GDS 2026 Result 3rd Merit List Date

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page