AP 10th & Inter Exams Postponed:
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉత్తర్వులు జారీ చేశారు. రేపు అనగా మార్చి 21వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రేపు జరగవలసిన ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షను ఏప్రిల్ రెండో తేదీకి వాయిదా వేశారు. అలాగే రేపు జరగవలసిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్మినిస్ట్రేషన్-1 & లాజిక్ paper-1 పరీక్షను ఈ నెల 21వ తేదీ నుండి 25వ తేదీకి వాయిదా వేశారు. మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన పరీక్షలు యధావిధిగా జరగనున్నట్లు విద్యాశాఖ మంత్రి తెలిపారు.
వాయిదా వేసిన పరీక్షల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి మార్చి 21వ తేదీన జరగవలసిన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేస్తూ DEO ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా వేసిన పరీక్షలు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- 10వ తరగతి : ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల్లో మార్చి 21వ తేదీన జరగవలసిన ఇంగ్లీష్ పేపర్ యొక్క పరీక్షను ఏప్రిల్ రెండో తేదీకి వాయిదా వేశారు.
- ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలకి సంబంధించి మార్చి 21వ తేదీన జరగవలసిన అడ్మినిస్ట్రేషన్-1 & లాజిక్ paper-1 ను మార్చి 25వ తేదీకి వాయిదా వేశారు
ఈ పరీక్షల వాయిదాకి సంబంధించిన సమాచారం యొక్క ఉత్తర్వులను డీఈఓ లకు పంపిస్తూ ఈ పరీక్షలకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఆ తేదీలలో చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అయితే పదో తరగతి పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు యొక్క తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి.