Telangana Intermediate 2026 Hall Tickets 2026:
తెలంగాణ ఇంటర్మీడియట్ చదువుతున్న మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ కోసం దాదాపుగా 20 లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు వారి యొక్క హాల్ టికెట్లను ఈరోజు లేదా రేపు ఏ క్షణమైనా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. హాల్ టికెట్లను విడుదల చేయడానికి, తెలంగాణ విద్యాశాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్నెట్ హాల్ టికెట్లు విడుదల కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ చూసి తెలుసుకోండి
TS ఇంటర్మీడియట్ హాల్ టికెట్స్ విడుదల తేదీ:
తెలంగాణ ఇంటర్మీడియట్ చదువుతున్న మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం విద్యార్థుల యొక్క అకాడమిక్ పరీక్షల హాల్ టికెట్లను ఫిబ్రవరి 16 లేదా 17వ తేదీలలో విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. ఇది అధికారిక సమాచారం కాకపోయినప్పటికీ ఈ రెండు రోజులలో హాల్ టికెట్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరీక్ష రాయిపోయే విద్యార్థులు వారి యొక్క మొబైల్ ఫోన్లోనే, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నారు.
How To Download TS Intermediate 2026 Hall Tickets:
తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సరం హాల్ టికెట్లను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
- ముందుగా విద్యార్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/ లోకి వెళ్ళండి.
- వెబ్సైట్ హోం పేజ్ లో “TS Inter 1st Year 2026 Hall Tickets ” ” TS Inter 2nd Year Hall Tickets 2026″ Download ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- అక్కడ విద్యార్థుల యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ లేదా మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, అలాగే డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
- వెంటనే స్క్రీన్ పైన మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది.
- హాల్ టికెట్లో మీకు పరీక్షల వారీగా ఏ రోజు ఏ తేదీన ఏ సెంటర్లో పరీక్ష ఉంటుందో చెక్ చేసుకోండి.
- మీ ఫోటో, సిగ్నేచర్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూసుకోండి.
TS Inter 1st Year & 2nd Year Hall Tickets: Download
FAQ’s:
1. తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల హాల్ టికెట్స్ ఎప్పుడు విడుదల చేయనున్నారు?
ఫిబ్రవరి 16 లేదా 17వ తేదీలలో ఈ పరీక్షల యొక్క హాల్ టికెట్లను విడుదల చేసే అవకాశం ఉంది.
2. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్పటినుండి ఎప్పటి వరకు జరగనున్నాయి?
ఫిబ్రవరి 25వ తేదీ నుండి మార్చి 17వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
3. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?
ఏప్రిల్ మూడో వారం లేదా నాలుగో వారంలో పరీక్షలు విడుదల చేయనున్నారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల యొక్క హాల్ టికెట్లు మరియు ఇతర అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.