AP Court Jobs 2026:
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కోర్టులో పని చేయడానికి కాంట్రాక్టు విధానంలో 06 పోస్టులతో కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు, పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అభ్యర్థులను ఎంపిక చేసి మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్లను పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ వివరాలు:
ఏపీ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం కింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ జిల్లా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, తూర్పుగోదావరి జిల్లా |
| పోస్టుల పేర్లు | కోర్టు అసిస్టెంట్, కోర్టు అటెండర్స్ |
| మొత్తం ఖాళీలు | 06 |
| అర్హతలు | పదవ తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 16, 2026 |
| ఆఫీషియల్ వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కోర్టుల్లో పనిచేయడానికి కాంట్రాక్టు విధానంలో విడుదలైన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏడవ తరగతి లేదా పదో తరగతి లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు జిల్లా కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో పరిమితిలో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరిల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత శాలరీ ఉంటుంది:
కోర్టు అసిస్టెంట్ మరియు అటెండర్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 6000 నుండి 10000 రూపాయలు చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు.
సెలక్షన్ ప్రాసెస్:
కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
- రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేకుండా
- మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అర్హత కలిగిన వారు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారంని డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | ఫిబ్రవరి 02, 2026 |
| అప్లికేషన్ ఆఖరు తేదీ | ఫిబ్రవరి 16, 2026 |
| నోటిఫికేషన్ & అప్లికేషన్ | Download |
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.