IBPS PO 2025 Prelims Results:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ సెలక్షన్ (IBPS) ఇటీవల 5208 పోస్టులతో ప్రొఫెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 23, 24వ తేదీన ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. అక్టోబర్ 12వ తేదీన మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహించనున్నటువంటి నేపథ్యంలో ప్రిలిమినరి పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ మూడో వారం లేదా నాలుగో వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు చూసి తెలుసుకుందాం.
IBPS PO Prelims 2025 Results Date:
ఐబీపీఎస్ PO 2025 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను సెప్టెంబర్ మూడవ వారం లేదా నాలుగో వారంలో విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు. ఆగస్టు 23, 24వ తేదీల్లో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ని తరచూ విజిట్ చేస్తూ ఉండాలని అధికారులు తెలిపారు.
IBPS PO 2025 prelims expected cutoff marks:
ఐబీపీఎస్ పిఓ 2025 పరీక్ష యొక్క అంచనా కట్ ఆఫ్ మార్కుల వివరాలను ఈ క్రింది టేబుల్ ద్వారా చెక్ చేసుకోండి. ఇవి అంచనా మార్కులు మాత్రమే అధికారిక మార్కులు కాదు.
| క్యాటగిరి | ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ |
| GENERAL | 46-48 |
| SC | 45 5-47.5 |
| ST | 37-40 |
| OBC-NCL | 46-48 |
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:
ఐబీపీఎస్ పీవో 2025 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చెక్ చేసుకోగలరు.
- ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
- వెబ్సైట్ హోం పేజ్ లో ” IBPS PO 2025 prelims results ” ఆప్షన్ ఎంచుకోండి
- అభ్యర్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే స్క్రీన్ పైన మీరు ప్రిలిమినరీ పరీక్షలో పాస్ అయ్యారా లేదా మీకు వచ్చిన మార్కులు అనేది చూపిస్తుంది
- వచ్చిన మార్కులను నోట్ చేసుకోండి.
- ప్రిలిమినరీ పరీక్షలో పాసైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వండి.
IBPS PO 2025 prelims results website
FAQ’s:
1. ఐబీపీఎస్ పిఓ 2025 ప్రిలిమ్స్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించారు?
ఆగస్టు 23 మరియు 24వ తేదీలలో ప్రిలిమినరీ రాత పరీక్షలు నిర్వహించారు
2. ఐబీపీఎస్ పీవో 2025 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు చెక్ చేసుకునే వెబ్సైట్ ఏమిటి?
https://ibps.in/ ఈ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.