TS Inter Supplememtary Results 2025:
తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లమెంటరీ రాత పరీక్షల ఫలితాలను జూన్ రెండవ వారంలో (జూన్వి 13th లేదా జూన్ 14th ) విడుదల చేయనున్నారు. మే 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 4.12 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మే 30వ తేదీ నుండి పరీక్ష పత్రాలు మూల్యాంకనం ప్రారంభించిన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారులు, ఇటీవల ప్రశ్నాపత్రాల మూల్యాంకనం పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు ఫలితాలను విడుదల చేయడానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులు వారి యొక్క ఫలితాలను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మార్క్స్ మెమో ఏ విధంగా ప్రింట్ అవుట్ తీసుకోవాలనే పూర్తి సమాచారం ఈ ఆర్టికల ద్వారా తెలుసుకుందాం.
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:
తెలంగాణ ఇంటర్ మొదటి మరియు రెండో సంవత్సర సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది విధానాన్ని ఫాలో అవ్వండి.
- ముందుగా తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- వెబ్సైటు హోం పేజ్ లో “TS Inter 1st Year & 2nd Year Supplememtary Results 2025″ ఆప్షన్స్ని ఎంచుకోండి.
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ మరియు రోల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
- స్క్రీన్ పైన సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు యొక్క మార్క్స్ మెమో డౌన్లోడ్ అవుతుంది.
- అది ప్రింట్ అవుట్ తీసుకొని, సేవ్ చేసుకోండి.
తెలంగాణ ఎంసెట్ మరియు అడ్మిషన్స్ ప్రారంభ తేదీ
ఫలితాలు విడుదల తేదీ?:
తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను జూన్ రెండో వారంలోనే (అనగా 13 లేదా 14వ తేదీన) విడుదల చేస్తామని గతంలోనే బోర్డు అధికారులు తెలిపారు. కానీ, స్పష్టమైన తేదీ వెల్లడించలేదు. అయితే ఫలితాలను జూన్ 15వ తేదీ లోపల విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.
TGBIE Inter Board Results Website
FAQ’s:
1. తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల తేదీ?
జూన్ 13 లేదా 14వ తేదీ నాటికి ఫలితాలను విడుదల చేయనున్నారు.
2. ఫలితాలను చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ ఏమిటి?
ఈ వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.