ఏపీ ప్రజలకు పెద్ద శుభవార్త: వీరికి 25 ఏళ్లపాటు ఉచిత విద్యుత్: ఇప్పుడే అప్లై చేయండి

By: Sivakrishna Bandela

On: June 4, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ అందించే విధంగా ఒక గొప్ప పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైనటువంటి ప్రజల ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానల్స్ అమర్చబడతాయి. ఈ పథకం పేరు ‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన'(PM Suryaghar Muft Bijili Yojana). చాలామంది కుటుంబాలపై కరెంటు భారం పడకుండా చేసే ఈ పథకం యొక్క వివరాలు, అర్హతలు, దరఖాస్తు చేసుకునే ప్రక్రియ గురించి ఇప్పుడు పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ఈ పథకంలో ముఖ్య అంశాలు:

JOIN WHAT’S APP GROUP

  • పథకం పేరు: ‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన’
  • కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందవచ్చు
  • అర్హులైన నివాస్ యొక్క ఇంటి పైకప్పు పై సోలార్ ప్యానల్స్ అమర్చబడతాయి
  • దీని ద్వారా ఆ కుటుంబానికి 25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ లభిస్తుంది
  • దీనితోపాటు అదనంగా ప్రభుత్వమే Upfront ఖర్చులు కూడా భరిస్తుంది.
  • ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరాలని ఉంది

ఈ పథకానికి ఎవరు అర్హులు?:

‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన’ పథకం ద్వారా మీరు సోలార్ ప్యానల్స్ ని పొందాలంటే ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

ఏపీలో తల్లికి వందనం పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది: ఇవి వెంటనే సబ్మిట్ చేయండి

  • 250 యూనిట్లకు లోబడి విద్యుత్ను వినియోగించే కుటుంబాలు అర్హులు
  • ఆ కుటుంబం యొక్క ఆదాయపరిమితి సంవత్సరానికి ₹1.5 లక్షల లోపు ఉండాలి
  • రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, EV చార్జింగ్ స్టేషన్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంత ఖర్చు అవుతుంది?:

  1. రెండు కిలో వాట్ల సోలార్ ప్యానల్స్ ధర : ₹1.10లక్షలు ఉంటుంది.
  2. ఇందులో కేంద్రం ఇచ్చే సబ్సిడీ: ₹60,000/-
  3. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ : ₹20,000/-
  4. ఈ పథకం లబ్ధి పొందే గ్రహీత యొక్క భారం: సుమారుగా ₹30,000 మాత్రమే

ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది?:

  • రెండు కిలో వాట్ల సోలార్ ప్యానల్స్ ద్వారా నెలకు సగటున 200 నుండి 240 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
  • ఇది మధ్యతరగతి మరియు దిగువ తరగతి కుటుంబాలకు సరిపడినంత విద్యుత్ ని ఉత్పత్తి చేసి ఇస్తుంది.
  • అదనంగా 50 యూనిట్లు వినియోగం వస్తే చార్జ్ ₹117/- మాత్రమే ఉంటుంది.

పథకానికి దరఖాస్తు ఎలా చేసుకోవాలి?:

‘పీఎం సూర్యఘర్ ముప్తి బిజిలీ యోజన’ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ క్రింది విధానాన్ని ఫాలో అవ్వండి.

ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ రీఓపెన్ డేట్ ఇదే: తల్లిదండ్రులు, విద్యార్థులకు ముఖ్య సూచనలు

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free
  • ఈ పథకానికి మీ ప్రాంతీయ జిల్లా కార్యాలయంలో గాని లేదా అధికారిక వెబ్సైట్లో గాని అప్లై చేసుకోవాలి
  • ఆధార్ కార్డ్, లబ్ధిదారుని బ్యాంకు పాస్ బుక్, ఇంటి పట్టా పత్రాలు సిద్ధం చేసుకోవాలి
  • అధికారులు వచ్చి ఇంటిని పరిశీలించాక అన్ని వివరాలు కరెక్ట్ గా ఉన్నట్లయితే మీకు సోలార్ ప్యానల్స్ ని అమర్చుతారు.

ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏమిటి?

  1. ప్రజలు విద్యుత్ ఖర్చుల నుండి విముక్తి పొందవచ్చు
  2. పర్యావరణహితమైన జీవనశైలి ఉంటుంది.
  3. మధ్యతరగతి కుటుంబాలకు దీర్ఘకాలిక ఉపశమనం కలుగుతుంది
  4. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గుతుంది.

PM Suryaghar Muft Bijili Yojana: Official Website

ఈ పథకం గురించి మీకు తెలిసిన వారందరికీ సమాచారం అందించి, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి అలాగే దిగువ మధ్యతరగతి కుటుంబాలు లబ్ధి పొందే విధంగా సహకరించాల్సిందిగా ప్రార్థన. ఇలాంటి ప్రభుత్వ పథకాల వివరాల కోసం మా వెబ్సైట్ Www.freejobsintelugu.com నీ సందర్శించండి

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ట్రైన్ టికెట్లు క్యాన్సిల్ చేస్తున్న వారికి అలర్ట్ – రూల్స్ మారాయి : ట్రైన్ టికెట్ కొత్త క్యాన్సిలేషన్ చార్జీలు, రిఫండ్ వివరాలు ఎలా ఉన్నాయి.

ఏప్రిల్ ఒకటి నుండి పాన్ కార్డు కొత్త రూల్స్ : మార్చి 31 లోపు ఉచితంగా ఇలా అప్లై చేసుకోండి: New Pan Card Rules April 2026 | Apply PAN Card For Free

ఉచిత గ్యాస్ కనెక్షన్ + ₹550 కే రీఫిల్ – వెంటనే ఇలా అప్లై చేయండి | PM Ujjwala Yojana 2.0 Scheme 2026

ఏపీలో 10.42 లక్షల ఇళ్ళ మంజూరు – లబ్ధిదారుల జాబితా విడుదల | AP PMAY Gramin 2.0 Beneficiary List 2026 | Check Full Details

తల్లికి వందనం పధకం డబ్బులు పడలేదా?: ఈరోజు లాస్ట్ డేట్ వెంటనే ఇలా చేయండి డబ్బులు వస్తాయి.

1st క్లాస్ నుండి ఇంటర్/ డిప్లొమా వరకు చదువుతున్న విద్యార్థులకు ₹18,000/- స్కాలర్షిప్స్ ఇస్తారు – ఇలా Apply చెయ్యండి.

Translate »

You cannot copy content of this page