TGCAB Notification 2024:
తెలంగాణాలోని రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుండి జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకుల్లో పని చేసేందుకుగానూ 10 కోఆపరేటివ్ ఇంటర్న్స్ కి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. MBA లేదా 2 సంవత్సరాల PGDM పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
అర్హతలు కలిగిన అభ్యర్థులు 30th నవంబర్ 2024 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పంపగలరు.
అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్ :డిప్యూటీ జనరల్ మేనేజర్,మానవ వనరుల నిర్వహణ విభాగం,తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,#4-1-441, ట్రూప్ బజార్, హైదరాబాద్ – 500 001.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణాలోని రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుండి జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకుల్లో పని చేసేందుకుగానూ 10 కోఆపరేటివ్ ఇంటర్న్స్ కి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. MBA లేదా 2 సంవత్సరాల PGDM పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎలా సెలక్షన్ చేస్తారు:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 10th, ఇంటర్, డిగ్రీ, Pg లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు. మంచి మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు వస్తాయి.
శాలరీ వివరాలు:
మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,000/- శాలరీ ఉంటుంది. TA, DA వంటి ఇతర బెనిఫిట్స్ కూడా బ్యాంక్ వారు చెల్లిస్తారు.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు 05, 03 సంవత్సరాల వయో సడలింపు కూడా ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్ ఇవే:
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు : Apply
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్ pdf, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ పెట్టుకోగలరు.
తెలంగాణా కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు 10 జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.