Telangana Endowment Dept. Notification 2024:
తెలంగాణాలోని దేవధాయ శాఖలో 111 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు, ఆ ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC కి ఖాళీల వివరాలు పంపినట్లుగా సమాచారం వచ్చింది. ఈ 111 పోస్టులలో అసిస్టెంట్ కమీషనర్ 04 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 05 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రూప్ 3 కింద 54 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 14 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఖాళీ పోస్టుల పూర్తి వివరాలు చూడండి.
దేవాదాయ శాఖలో 111 పోస్టులు:
తెలంగాణాలోని దేవధాయ శాఖలో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ కమీషనర్ 04 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 05 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రూప్ 3 కింద 54 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 14 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కేబినెట్ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్స్ : No Exam
పోస్టుల అర్హతలు:
111 పోస్టులలో ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న 34 పోస్టులకు డిప్లొమా లేదా ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం ఉంటుంది. మిగిలిన అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
విద్యుత్ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు : Apply
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా అందులో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
111 పోస్టుల భర్తీ ఎప్పుడు?:
దేవదాయ శాఖలో ఖాళీగా ఉన్న 111 పోస్టుల వివరాలను TGPSC కి సంబందించిన డిపార్ట్మెంట్ వారు పంపించడం జరిగింది. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది.
జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు : Any డిగ్రీ అర్హత
శాలరీ ఎంత ఉంటుంది:.
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹35,000/- నుండి ₹55,000/- వరకు జీతాలు ఉంటాయి . TA, DA, HRA వంటి అన్ని బెనిఫిట్స్ కల్పిస్తారు.
ఖాళీల సమాచారం:
దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబందించిన సమాచారాన్ని ఈ క్రింది PDF LINK ఆధారంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు.
దేవాదాయ శాఖలో ఉద్యోగాలను త్వరలో భర్తీ చేసే అవకాశం ఉన్నది.