వ్యవసాయ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | ICAR Agriculture Dept Notification 2024 | Freejobsintelugu

Agriculture Dept. Notification 2024:

వ్యవసాయ శాఖకు సంబందించిన ICAR అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి సెమీ స్కిల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, ఏదైనా డిగ్రీ లేదా అగ్రికల్చర్ డిప్లొమా చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. 21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 5th నవంబర్ న జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి మీ డాక్యుమెంట్స్ తో హాజరు కాగలరు. ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

మొత్తం పోస్టులు, వాటి అర్హతలు:

సెమీ స్కిల్డ్, ఫీల్డ్ అసిస్టెంట్స్ : 02 పోస్టులు : ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకువాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

రైల్వే 2025 జాబ్ క్యాలెండర్ విడుదల : Official PDF

యంగ్ ప్రొఫెషనల్-1 : 02 పోస్టులు : ఈ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్ లో డిప్లొమా చేసినవారు, అగ్రికల్చర్ విభాగాల్లో డిగ్రీ చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

వయస్సు వివరాలు :

21 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

తెలంగాణా జిల్లా కార్యాలయంలో ఉద్యోగాలు : No Exam

ఎంపిక, ఇంటర్వ్యూ తేదీ:

అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నవంబర్ 5th న రీజినల్ స్టేషన్ కర్ణల్ నందు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేస్తారు. అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు ఫారం, సంబందించిన అర్హత సర్టిఫికెట్స్ తీసుకుని ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు.

గ్రామీణ ఎరువుల తయారీ సంస్థలో ఉద్యోగాలు : 10th అర్హత

శాలరీ వివరాలు:

సెమీ స్కిల్డ్ ఫీల్డ్ అసిస్టెంట్, యంగ్ ప్రొఫెనల్ ఉద్యోగాలకు ₹15,000/- నుండి ₹30,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి టెంపరరీ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

వాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. ఉచితముగా ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.

ఇంటర్వ్యూకి కావాల్సిన డాక్యుమెంట్స్:

అప్లికేషన్ ప్రింట్ అవుట్ డాక్యుమెంట్, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్ ఉంటే అవి కూడా తీసుకొని వెళ్ళాలి.

ఎలా అప్లై చేసుకోవాలి:

నోటిఫికేషన్ డాక్యుమెంట్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

Notification & Application Form PDF

ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని ప్రతి రోజు Open చేసి చూడండి. మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది.

Leave a Comment

error: Content is protected !!