AP KGBV Notification 2024:
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ కింద ఉన్నటువంటి కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ కోసం 604 ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీ చెయ్యడానికి విడుదల చేశారు. ఏదైనా డిగ్రీతో పాటు, B.Ed చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలభారీగా ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ:26th సెప్టెంబర్ 2024
అప్లికేషన్ ఆఖరు తేదీ : 10th అక్టోబర్ 2024
ఉద్యోగంలో జాయిన్ అయ్యే తేదీ : 24th అక్టోబర్ 2024
పోస్టుల వివరాలు వాటి అర్హతలు:
AP సమగ్ర శిక్షా అభియాన్ నుండి 604 ప్రిన్సిపాల్, PGT, CRT,PET, Accountant, Part Time టీచర్స్, వార్డెన్ ఉద్యోగాలను విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి B.Ed చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి. మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
తెలంగాణా ప్రభుత్వం 633 Govt జాబ్స్ విడుదల
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 47 సంవత్సరాల వయస్సు ఉన్నా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా ఎంపిక చేస్తారు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో క్వాలిఫికేషన్స్ లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు ఫీజు:
అర్హత కలిగిన అన్ని కేటగిరీల అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులు మాత్రమే అంగీకరిస్తారు.
జీతం వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹18,500/- నుండి ₹34,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర ఎటువంటి అలవెన్స్ లు ఉండవు.
ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి:
ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైటు https://apkgbv.apcfss.in/ వనందు అక్టోబర్ 10వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలి. గడువు తర్వాత అప్లికేషన్స్ అంగీకరించబడవు.
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.