APSDPS Notification 2024:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ నుండి అవుట్ సోర్సింగ్ పద్దతిలో 24 స్వర్ణంధ్ర విజన్ మానేజ్మెంట్ యూనిట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. నెలకు ₹60,000/- శాలరీ ఇస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
పోస్టులు వివరాలు వాటి అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి డిగ్రీ అర్హత కలిగిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్, ప్లానింగ్ సొసైటీ నుండి విడుదలయిన 24 స్వర్ణంధ్ర విజన్ మానేజ్మెంట్ యూనిట్ ప్రొఫెషనల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
శాలరీ ఎంత ఉంటుంది?:
ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹60,000/- శాలరీ ఉంటుంది. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.
వయో పరిమితి వివరాలు:
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు ఎటువంటి వయో సడలింపు లేదు.
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు
ఎంపిక విధానం ఎలా చేస్తారు?:
అర్హతలు ఉన్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి, తర్వాత అందులో అర్హత పొందిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ రెండింటిలో అర్హత పొందినవారికి డిగ్రీ సర్టిఫికెట్స్, అనుభవం ఉన్న సర్టిఫికెట్స్, ఇతర సర్టిఫికెట్స్ కలిగి ఉంటేనే ఈ ఉద్యోగాలు ఆ అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే తేదీలు:
13.09.2024 నుండి 28.09.2024 వరకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులు చేసుకోగలరు. ఇతర వేరే విధంగా దరఖాస్తు చేసుకున్నవారి అప్లికేషన్స్ అంగీకరించబడవు.
రైల్వేలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్
దరఖాస్తు ఫీజు:
ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఉచితంగా ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కి కావాల్సిన డాక్యుమెంట్స్:
10వ తరగతి సర్టిఫికెట్స్ ఉండాలి
డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, మార్క్స్ మెమో కలిగి ఉండాలి.
SC, ST, OBC కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ ఉండాలి.
4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణాలో 3 జిల్లాలో 217 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఎలా apply చెయ్యాలి:
అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని వెంటనే ఆన్లైన్ లో అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదలయ్యే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.