Vijayawada International Airport Jobs 2024:
AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ డిపార్ట్మెంట్ ద్వారా విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఖాళీగా ఉన్న పాసెంజర్ సర్వీస్ ఏజెంట్స్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు 10వ తరగతి అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. 11 నెలలు పాటు కాంట్రాక్టు విధానంలో పని చెయ్యాల్సి ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. అభ్యర్థుల అప్లికేషన్స్ మెయిల్ చేస్తే చాలు షార్ట్ లిస్ట్ అయినవారికి ఉద్యోగాలు ఇస్తారు. ఎయిర్ పోర్ట్ జాబ్స్ పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, అర్హతలు:
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పాసెంజర్ సర్వీస్ ఏజెంట్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:
అర్హత కలిగినవారు నోటిఫికేషన్ లో ఇచ్చిన మెయిల్ అడ్రస్ కు వారి బయో డేటా, ఇతర అర్హత డాక్యుమెంట్స్ మెయిల్ చేసినట్లయితే షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి సెలక్షన్ చేస్తారు.
కేబినెట్ సెక్రటేరియట్ Govt జాబ్స్ : Apply
దరఖాస్తు చేసే విధానం:
10వ తరగతి అర్హత కలిగినవారు మెయిల్ అడ్రస్ [email protected] కు వారి యొక్క సర్టిఫికెట్స్, బయో డేటా డాక్యుమెంట్స్ ని 20th సెప్టెంబర్ లోగా మెయిల్ చెయ్యాలి. ఎటువంటి ఫీజు లేదు.
ట్రైనింగ్ వివరాలు:.
ఎంపిక అయిన అభ్యర్థులకు 11 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో మంచి సామర్ధ్యం చూపించిన అభ్యర్థులకు పర్మినెంట్ జాబ్స్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నది.
తెలంగాణా KVS స్కూల్స్ లో ఉద్యోగాలు
ట్రైనింగ్ లో స్టైపెండ్:
ట్రైనింగ్ తీసుకొనే సమయంలో అభ్యర్థులకు నెలకు ₹10,000/- చొప్పున స్టైపెండ్ ఇస్తారు. ఎటువంటి ఇతర అలవెన్స్ లు ఉండవు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
బయో డేటా ఫారం, 10th మార్క్స్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఇతర డాక్యుమెంట్స్ సబ్మిట్ చెయ్యాలి.
గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : No Exam
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే 20th సెప్టెంబర్ తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఎయిర్పోర్ట్ లో ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.