AP మంత్రుల పేషీల్లో భారీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | APDC Recruitment 2024 | Freejobsintelugu

APDC Outsourcing Jobs:

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా 24 సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, 24 సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేసి వఅవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ₹30,000/- నుండి ₹50,000/- వరకు పోస్టులను అనుసరించి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం తెలుసుకొని వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు, అర్హతలు:

సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్: 24 పోస్టులు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి BE, BTECH పూర్తి చేసిన అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల వయస్సు కలిగి అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

Join Our Telegram Group

సోషల్ మీడియా అసిస్టెంట్: 24 పోస్టులు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి Any డిగ్రీ అర్హత పూర్తి చేసిన అభ్యర్థులు 18 నుండి 42 సంవత్సరాల వయస్సు కలిగి అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

శాలరీ వివరాలు :

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000 నుండి ₹50,000/- వరకు పోస్టులను అనుసరించి చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు ఏమీ ఉండవు.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలు, వయస్సు ఆధారంగా మెరిట్ మార్కుల ప్రకారం సెలక్షన్ చేసి అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇస్తారు.

తెలంగాణా విద్యుత్ శాఖలో 2,260 ఉద్యోగాలు

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి.

ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

4th నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

తెలంగాణా సంక్షేమ శాఖలో 13000 ఉద్యోగాలు

2 నెలలు ట్రైనింగ్ :

ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగాలకు అవుట్ సోర్సింగ్ విధానంలో ఎంపిక అయిన అభ్యర్థులలు మొదటగా 2 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత పర్మినెంట్ గా మారుస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఆఖరు తేదీ, ఫీజు వివరాలు:

అర్హతలు ఉన్న అభ్యర్థులు 23rd సెప్టెంబర్ 2024 వరకు నోటిఫికేషన్ లో ఇచ్చిన Mail అడ్రస్ (info.apdcl@gmail.com) దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి ఫీజు లేదు, ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు

Notification PDF

Official website

ఆంధ్రప్రదేశ్ లోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల సమాచారం కొరకు మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!