AIESL Notification 2024:
ఎయిర్ పోర్ట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి 76 అసిస్టెంట్ సూపర్వైసర్, రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హతలు కలిగిన పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకునే విధంగా నోటిఫికేషన్ జరిగింది చేశారు. 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఎయిర్పోర్ట్ ఉద్యోగాల ప్రకటన పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేయండి.
పోస్టుల అర్హతలు:
రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్, లోకల్ భాష మాట్లాడటం వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలి.BCAS సర్టిఫికెట్ కలిగి ఉండాలి
అసిస్టెంట్ సూపర్వైసర్ సెక్యూరిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజీ నుండి 3 సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు హిందీ, ఇంగ్లీష్, లోకల్ భాష మాట్లాడటం వచ్చినవారు దరఖాస్తు చేసుకోవాలి.BCAS సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఫైర్ ఫైటింగ్, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మానేజ్మెంట్, MS వర్డ్, MS ఆఫీస్ పై అవగాహన కలిగినవారికి ప్రాధాన్యత ఇస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.
వయస్సు ఎంత ఉండాలి:
01.09.2024 నాటికి 18 నుండి 49 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి. SC ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులు 163cm ఎత్తు, మహిళ అభ్యర్థులు 154.5cm ఎత్తు ఉండాలి.
రైల్వేలో 10th అర్హతతో పరీక్ష లేకుండా Govt జాబ్స్
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులలో రీజినల్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకు ₹47,625/- శాలరీ, సూపర్వైసర్ పోస్టులకు ₹28,000/- శాలరీ ఇస్తారు. ఎటువంటి అలవెన్స్ లు ఉండవు.
దరఖాస్తు ఆఖరు తేదీ:
అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 24వ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.న్యూఢిల్లీలోని చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్, AI ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థకు అప్లికేషన్స్ పంపించాలి.
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేసుకోవడానికి SC, ST అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు, మిగిలిన అభ్యర్థులు ₹1000/- ఫీజు చెల్లించాలి.
సిలబస్ వివరాలు:
AI ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు సంబందించిన సిలబస్, రాత పరీక్ష విధానం అన్ని వివరాలు పూర్తి నోటిఫికేషన్ లో చూడవచ్చు.
ఎలా apply చెయ్యాలి:
డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగాలకోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఈ క్రింద ఉన్న Link ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని నిర్నీత గడువులోగా దరఖాస్తు చేసుకోగలరు.
Notification PDF & Application Form
ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.