10th అర్హతతో 39,000+ పోస్టులకు నోటిఫికేషన్ | SSC GD Notification 2024 | Freejobsintelugu

SSC GD Notification 2024:

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి 39,481 పోస్టులతో 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. BSF, CISF, CRPF, SSB, ITBP, NCB వంటి పలు కేంద్ర బలగాల్లో పని చెయ్యడానికి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 18 నుండి 23 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు Online లో దరఖాస్తులు చేసుకోవాలి. ఉద్యోగాల ప్రకటన పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

పోస్టులవారిగా ఖాళీలు ఇవే:

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ : 15,654 పోస్టులు

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్: 7,145 పోస్టులు

సెంట్రల్ రెజర్వుడ్ పోలీస్ ఫోర్స్ : 11,541 పోస్టులు

సశస్త్ర సీమా బల్ : 819 పోస్టులు

ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్: 3017 పోస్టులు

అస్సాం రిఫల్స్ : 1248 పోస్టులు

సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్: 35 పోస్టులు

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో : 22 పోస్టులు

మొత్తం పోస్టులు : 39,481 ఉద్యోగాలు

DRDO లో కొత్త నోటిఫికేషన్ విడుదల: Apply

అర్హతలు, వయస్సు:

పైన తెలిపిన కేంద్ర బలగాల్లో ఖాళీగా ఉన్న 39,481 పోస్టులకు 10వ తరగతి అర్హత కలిగిన పురుషులు, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.

Join Our Telegram Group

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి, ఫిబ్రవరిలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అర్హత సాధించిన వారికి ఫిసికల్ ఈవెంట్స్, ఫిసికల్ Measurements పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టుల ఆధారంగా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.

దరఖాస్తు ఫీజు:

UR, OBC, EWS పురుష అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. మహిళలు, SC, ST, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు చేసుకునే తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 05/09/2024

దరఖాస్తు ఆఖరు తేదీ : 14th /10/2024

దరఖాస్తు కరెక్షన్ చేసుకునే తేదీ : నవంబర్ 5th నుండి నవంబర్ 7th వరకు

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ : జనవరి – ఫిబ్రవరి 2025

సిలబస్ వివరాలు:

రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ నౌలెడ్జి, ఇంగ్లీష్ వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. తెలుగులోనే రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 80 ప్రశ్నలు 160 మార్కులకి ఇస్తారు. 0.25 మార్క్స్ నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

ssc.gov.in వెబ్సైటులో ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు కూడా ఆన్లైన్ విధానంలోనే చెల్లించాలి.

Notification PDF

SSC GD State Wise Vacancy List PDF

Apply Online

స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇతర సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్సించండి.

Leave a Comment

error: Content is protected !!