తెలంగాణా జిల్లా కోర్టు ఉద్యోగాలు విడుదల | Telangana District Court Jobs Notification 2024 | Freejobsintelugu

Telangana District Court Jobs Notification 2024:

తెలంగాణాలోని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి కాంట్రాక్టు పద్దతిలో ఓని చెయ్యడానికి సంబందించి 7th, 10th, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల కోసం అధికారికంగా ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్, ఆఫీస్ ప్యూన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాలో ఉన్న జిల్లా కోర్టు లో పని చేసే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలు తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా కోర్టు నుండి విడుదలకావడం జరిగింది. ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టులవారీగా అర్హతలు:

ఆఫీస్ అసిస్టెంట్ /క్లర్క్ : ఏదైనా డిగ్రీ అర్హత కలిగి కంప్యూటర్ ఆపరేటింగ్ పరిజ్ఞానం కలిగినవారు, టైపింగ్ స్పీడ్, ఫైల్ ప్రాసెసింగ్, మెయింటనెన్స్ స్కిల్స్ ఉన్నవారు అర్హులు.

ప్యూన్ / అటెండర్ : 7th నుండి 10th క్లాస్ వరకు అర్హత కలిగిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

Join Our Telegram Group

వయస్సు, జీతం వివరాలు:

18 నుండి 34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. వికలాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. జీతం వివరాలకొస్తే ప్యూన్ ఉద్యోగాలకు ₹14,000/- జీతం, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ₹20,000/- జీతం చెల్లిస్తారు. ఎటువంటి అలవెన్స్ లు ఉండవు.

ఎంపిక విధానం:

దరఖాస్తు చేసుకున్నవారిలో మంచి మార్కులు కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష లేదు.

తెలంగాణా విద్యుత్ శాఖలో 3000 ఉద్యోగాలు

ఖాళీల సంఖ్య, ముఖ్యమైన తేదీలు:

ఆఫీస్ అసిస్టెంట్ / క్లర్క్ : 02 పోస్టులు, ప్యూన్ / అటెండర్ : 02 పోస్టులు. దరఖాస్తు చేసుకునేవారు 28 ఆగష్టు 2024 నుండి 9 సెప్టెంబర్ 2024 లోపు దరఖాస్తులు చేసుకోవాలి. తర్వాత వచ్చిన అప్లికేషన్స్ తిరస్కరించడం జరుగుతుంది.

ముఖ్యమైన సూచనలు:

• అభ్యర్థులు అప్లికేషన్ లో పొందుపరిచిన వివరాలను మాత్రమే పరిగణించి సెలక్షన్ చేస్తారు.

• ఎటువంటి T, DA ఉండదు. సొంత ఖర్చులు పెట్టుకోవాలి.

• ఒక అభ్యర్థి రెండూ రకాల పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే రెండు అప్లికేషన్స్ వేరువేరుగా పెట్టుకోవలెను.

• ఆఖరు తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

• అప్లికేషన్స్ లో పూర్తి సమాచారం లేకుండా ఉన్నచో అవి కూడా అంగీకరించబడవు.

• ఎంపిక అయిన అభ్యర్థికి మాత్రమే సమాచారం ఇవ్వడం జరుగుతుంది.

• పూర్తి నోటిఫికేషన్ చూసి దరఖాస్తు చేసుకోగలరు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?:

జిల్లా కోర్టు అధికారిక వెబ్సైటు నందు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు లు చేసుకోవాలి. లేదా ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకోగలరు.

Notification & Application Form

తెలంగాణా జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు ని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!