మెట్రో రైల్వేలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు | Metro Railway Recruitment 2024 | Freshjobsindia

Metro Railway Recruitment 2024:

రైల్వే శాఖకు సంబందించిన ఢిల్లీ మెట్రో రైల్వేలో కాంట్రాక్టు పద్దతిలో పరీక్ష లేకుండా ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే విధంగా 13 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. 10th, 12th, ITI, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. సూపర్వైసర్, టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 3 సంవత్సరాలపాటు ట్రైనింగ్ ఉంటుంది. పూర్తి ఉద్యోగాల ప్రకటన చూసి అప్లికేషన్స్ పెట్టుకోండి.

పోస్టులవారీగా ఖాళీలు, అర్హతలు:

• సూపర్వైసర్ (PST): 04 పోస్టులు : 03 సంవత్సరాల డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి కొంత అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

Join Our Telegram Group

• టెక్నీషియన్ (PST ) :02 పోస్టులు : 10త లేదా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ITI లో ఎలక్ట్రికల్ /ఫిట్టర్ / కేబుల్ జాయింటర్ ట్రేడ్ లో అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

•సూపర్వైసర్ (సిగ్నలింగ్ టెలీకామ్):04 పోస్టులు : 03 సంవత్సరాల డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అర్హత కలిగిన వారు ధరఖాస్తూ చేసుకోవాలి. సంబందించిన విభాగంలో అనుభవం కూడా ఉండాలి.

• టెక్నీషియన్ (ట్రాక్ ) : 01 పోస్టు : ప్లంబర్ లో ITI చేసి సంబందించిన విభాగంలో అనుభవం ఉండాలి.

వయస్సు అర్హత:

సూపర్వైసర్ ఉద్యోగాలకు 23-40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.టెక్నీషియన్ ఉద్యోగాలకు 23 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST లకు 5 సంవత్సరాల వయోసడలింపు ఉంటుంది. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

ప్రభుత్వ కళాశాలలో అటెండర్, అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply

ట్రైనింగ్ సమయం :

ఢిల్లీ మెట్రో రైల్వేలో ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు ట్రైనింగ్ ఇస్తారు. ఎటువంటి సెలెవులు ఉండవు.

ఎంపిక విధానం :

ఎంపిక అయిన అభ్యర్థులకు ప్రీ ఎంగేజ్మెంట్ మెడికల్ పరీక్ష ఉంటుంది. రైల్వే శాఖకు సంబందించిన రూల్స్ ప్రకారం మెడికల్ ఎక్సమినేషన్ ఉంటుంది. అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత మెట్రో రైల్వే ఉద్యోగాలలోకి అభ్యర్థులను సెలక్షన్ చేస్తారు.

జీతం వివరాలు:

మెట్రో రైల్వేలో ఎంపికకాబడిన అభ్యర్థులకు సూపర్వైసర్ పోస్టులకు ₹46,000/- శాలరీ చెల్లిస్తారు. టెక్నీషియన్ పోస్టులకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹65,000/- శాలరీ చెల్లిస్తారు.

ఫుడ్ డిపార్ట్మెంట్ లో 345 గవర్నమెంట్ జాబ్స్

ఎన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి:

సూపర్వైసర్, టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే కనీసం 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల అనుభవం వున్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అనుభవం లేని అభ్యర్థులకు ఎటువంటి అవకాశం లేదు.

ముఖ్యమైన తేదీలు, సెలక్షన్ ప్రాసెస్:

అర్హత కలిగినవారు సెప్టెంబర్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా సెలక్షన్ చేసి మెట్రో రైల్వేలో ఉద్యోగాలు ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ పంపించాలి. ఎటువంటి TA, DA చెల్లించడం జరగదు. ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యండి.

Notification & Application Form

మెట్రో రైల్వే ఇతర రైల్వే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!