తెలంగాణాలో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs 2024 | Freejobsintelugu

Telangana Outsourcing Jobs 2024:

తెలంగాణాలోని మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ డిపార్ట్మెంట్ వారు అవుట్ సోర్సింగ్ విధానంలో 07 రకాల పోస్టులను భర్తీ చెయ్యడానికి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. MLHP, DEO Cum అకౌంటెంట్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్స్, సపోర్ట్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్, SNO పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టులవారీగా అర్హతలు, వయస్సు వివరాలు:

సపోర్ట్ స్టాఫ్ : 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు 18 -44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

డేటా ఎంట్రీ కమ్ అకౌంటెంట్: B.Com చేసి 2 సంవత్సరాలన అనుభవం కలిగి మరియు కంప్యూటర్ నౌలెడ్జి కలిగినవారు 18-44 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు.

Join Our Telegram Group

స్టాఫ్ నర్స్ : G.N.M. లేదా BSC నర్సింగ్ చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 18-44 సంవత్సరాల వయస్సు ఉండాలి.

ఫార్మసిస్ట్: ఇంటర్మీడియట్ తో పాటు డి.ఫార్మసీ చేసినవారు అర్హులు : 18 నుండి 44 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.

మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP): MBBS అర్హత కలిగి 18-44 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి.

SNO : తెలుగు భాష చదవడం, రాయడం వస్తే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

మెడికల్ ఆఫీసర్స్ : యునానిలో డిగ్రీ చేసినవారు అర్హులు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 570 ఉద్యోగాలు

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు ఫారంను అధికారిక వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకొని జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ మేడ్చల్ – మల్కాజ్గిరి పేరు మీద ₹500/- DD తీసి దరఖాస్తుతో కలిపి అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. అన్ని కులాల వారు ఈ ఫీజు చెల్లించాలి.

సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా దరఖాస్తు చేసుకున్నవారిలో మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు

దరఖాస్తు చేసే ఆఖరు తేదీ:

28.08. 2024 నుండి 30.08.2024 తేదీలలోపు అర్హత కలిగినవారు సంబందించిన జిల్లా అధికారి కార్యాలయానికి వెళ్లి అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి.

శాలరీ ఎంత ఉంటుంది:

పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹35,000/- వరకు జీతాలు ఉంటాయి. ఎటువంటి అలవెన్స్ లు ఉండవు.

ఎలా అప్లై చెయ్యాలి:

ఈ క్రింద ఉన్న అధికారిక వెబ్సైటు, అప్లికేషన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సమయం తక్కువ ఉన్నందున త్వరగా అప్లికేషన్ పెట్టుకోవాలి.

Notification PDF & Application Form

తెలంగాణా రాష్ట్రంలో ఉన్న జిల్లాలవారీగా విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసమా మా వెబ్సైటు Freejobsintelugu ని ప్రతి రోజూ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!