ఇంటెలిజెన్స్ Dept లో 10th అర్హతతో ఉద్యోగాలు | ICSIL Notification 2024 | Freejobsintelugu

ICSIL Notification 2024:

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ నుండి కాంట్రాక్చ్యువల్, అవుట్ సోర్సింగ్ కింద 10వ తరగతి, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు డ్రైవర్, ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఏమీ లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు.

ప్రకటన, పోస్టుల వివరాలు:

డ్రైవర్ : 11 పోస్టులు : 10వ తరగతి పాస్ అయ్యి, 3 సంవత్సరాల అనుభవం కలిగిన వారు అర్హులు

ప్రాజెక్ట్ అసోసియేట్: 01 పోస్ట్ : డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినవారు అర్హులు. వయస్సు ఎంత ఉన్నా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

Join Our Telegram Group

వయస్సు, జీతం వివరాలు:

18 నుండి 50 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రైవర్ పోస్టులకు ₹21,215/-, అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ కి ₹46,000/- జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

ఏ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న ₹590/- నాన్ రిఫండబుల్ ఫీజుని ఆన్లైన్ విధానంలో చెల్లించి, అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి.

Ap పోలీస్ కానిస్టేబుల్ 6,100 పోస్టుల ఫిసికల్ ఈవెంట్స్ అప్డేట్

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్స్ ప్రారంభం తేదీ : 26/08/2024

అప్లికేషన్స్ ఆఖరు తేదీ : 02/09/2024

సెలక్షన్ విధానం :

ICSIL ప్రకటన పూర్తి వివరాలు చూసి అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత సంబందిత డిపార్ట్మెంట్ వారు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి పిలుస్తారు. DV పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ICSIL డిపార్ట్మెంట్ లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో జాబ్ పోస్టింగ్ ఇస్తారు.

డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA, DA చెల్లించడం జరగదు.

హైకోర్టు లో 300 గవర్నమెంట్ జాబ్స్ విడుదల : 10th అర్హత

ఎలా అప్లై చేసుకోవాలి?:

ICSIL అధికారిక వెబ్సైటు నందు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ ప్రకటన, దరఖాస్తు ఫారం లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి

నోటిఫికేషన్ PDF

సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ సమాచారం కోసం మా వెబ్సైటు Freejobsintelugu ని ప్రతి రోజూ సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!