హైకోర్టులో 300 గవర్నమెంట్ జాబ్స్ | PHHC Notification 2024 | Freejobsintelugu

High Court Jobs Notification 2024:

భారతదేశంలోని 10వ తరగతి అర్హత ఉన్న అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా 300 పోస్టులతో ప్యూన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణాతో పాటు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిసికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రకటన పూర్తి సమాచారం చూసి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి.

మొత్తం పోస్టులు, వాటి అర్హతలు :

ప్యూన్ / అటెండర్ : 300 పోస్టులు

20/09/2024 నాటికీ 10వ తరగతి లేదా 10+2 ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ అర్హత కలిగిన అభ్యర్థులకు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత లేదు. మొత్తం 300 పోస్టులలో కేటగిరీలవారీగా పోస్టులు ఈ క్రింది విధంగా కేటాయించారు.

Join Our Telegram Group

జనరల్ కేటగిరీ : 243 పోస్టులు

SC/ST/BC : 30 పోస్టులు

Ex-Servicemen : 15 పోస్టులు

PWD అభ్యర్థులు : 12 పోస్టులు

ఎంత వయస్సు ఉండాలి:

20/09/2024 నాటికీ 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వికలాంగులకు 10 సంవత్సరాలు, Ex సర్వీస్ మెన్ కు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

రైల్వేలో 7,400+ ఉద్యోగాల నోటిఫికేషన్స్ : 10th అర్హత

అప్లికేషన్స్ ఫీజు :

పంజాబ్, హర్యానా కాకుండా ఇతర రాష్ట్రాలవారికి : ₹700/-

పంజాబ్, హర్యానా అన్ని కేటగిరీల అభ్యర్థులకు : ₹600/-

Pwd, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు : ₹600/-

ఏపీలో 550 ఉద్యోగాలు భర్తీ : అప్లై

అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 25/08/2024

ఆన్లైన్ దరఖాస్తు ఆఖరు తేదీ : 20/09/2024

సెలక్షన్ విధానం :

ప్రతి ప్రశ్న 2 మార్కుల చొప్పున 100 మార్కులకు 50 మల్టీపుల్ ఛాయస్ ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లీష్, హిందీ, పంజాబీ భాషల్లో రాత పరీక్ష ఉంటుంది. 90 నిముషాలు రాత పరీక్షకు సమయం కేటాయిస్తారు. ఈ పరీక్షలో 50% మార్కులు వచ్చిన అభ్యర్థులు తదుపరి ఫిసికల్ ఈవెంట్స్ కి హాజరు కావలెను. ఫిసికల్ ఈవెంట్స్ లో పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్ విభాగాల్లో పరీక్ష పెడతారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే

పరీక్ష సిలబస్ ఏమిటి?

అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి నుండి ప్రశ్నలు వస్తాయి. ప్యూన్ ఉద్యోగాల రాత పరీక్షకు సంబందించిన సిలబస్ ని నోటిఫికేషన్ లో చూడవచ్చు.

శాలరీ వివరాలు:

అన్ని అలవెన్స్ లు కలుపుకొని స్టార్టింగ్ లోనే ₹30,000/- జీతం వస్తుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ మాదిరి ఉద్యోగాలు

ఎలా అప్లై చెయ్యాలి:

పంజాబ్, హర్యానాకు సంబందించిన చండీగర్ హైకోర్టు అధికారిక వెబ్సైటులో మీ వివరాలు నమోదు చేసి దరఖాస్తు పూర్తి చేసుకోవాలి. నోటిఫికేషన్ లింక్, అప్లై ఆన్లైన్ లింక్ ఈ క్రింది లింక్స్ ద్వారా పొందవచ్చు.

Notification PDF

Apply Online

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.

Leave a Comment

error: Content is protected !!