Postal Jobs Notification 2024:
పోస్టల్ శాఖ, మెయిల్ మోటార్ సర్వీసెస్ చెన్నై నుండి అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకునే విధంగా 10 స్కిల్డ్ ఆర్టిసన్స్ (M.V. మెకానిక్, M. V. ఎలక్ట్రీషియన్, టైర్ మ్యాన్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్) పోస్టులతో గ్రూప్ C నాన్ గేజెట్టెడ్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. 01.07.204 నాటికీ 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 8వ తరగతి అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ప్రకారం నెలకు ₹30,000/- వరకు జీతం ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చెయ్యండి.
విద్యార్హతలు, వయస్సు వివరాలు:
ఏదైనా గుర్తింపు పొందిన టెక్నికల్ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత ట్రేడ్ లో అర్హత కలిగి ఉండాలి. లేదా 8వ తరగతి పాస్ అయ్యి ఒక సంవత్సరంపాటు సంబంధిత ట్రేడ్ లో అనుభవం కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. M. V. మెకానిక్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు LMV లేదా HMV లైసెన్స్ కలిగి ఉండాలి. 18-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అప్లై చేసుకోవాలి. SC, ST, OBC అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
జీతబత్యాల వివరాలు:
7th సీపీసీ ప్రకారం ₹19,900/- నుండి ₹63,200/- వరకు జీతం చెల్లిస్తారు. దీని ప్రకారం అన్ని అలవెన్స్ లు. కలిపి ₹30,000/- శాలరీ పొందవచ్చు.
రైల్వేలో 14,298 గవర్నమెంట్ జాబ్స్: 10+2 అర్హత
రిక్రూట్మెంట్ ప్రాసెస్:
స్కిల్డ్ ఆర్టిసన్స్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులకు కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ పరీక్ష పెడతారు ఇందులో అర్హత సాధించి మంచి మెరిట్ మార్కులు వచ్చినవారికి పోస్టల్ శాఖలో గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.
అప్లికేషన్ పెట్టుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్స్:
i. ఏజ్ ప్రూఫ్ కింద 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ సబ్మిట్ చెయ్యాలి.
ii. 8వ తరగతి మార్క్స్ లిస్ట్ / TC సర్టిఫికెట్ ఉండాలి
iii. టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
iv. SC, ST, OBC లకు కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
v. ఒక సంవత్సరం ట్రేడ్ అనుభవం కలిగిన సర్టిఫికెట్ ఉండాలి.
vi. M.V. మెకానిక్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు LMV / HMV లైసెన్స్ కలిగి ఉండాలి.
TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు
అప్లై చేసే ఆఖరు తేదీ:
మెయిల్ మోటార్ సర్వీసెస్, చెన్నై పోస్టల్ శాఖ నుండి విడుదలయిన ఈ ఉద్యోగాలకు ఆగష్టు 30వ తేదీలోగా speed post /Register post ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి. “ది సీనియర్ మేనేజర్, మెయిల్ మోటార్ సర్వీస్, No.37, గ్రీమ్స్ రోడ్డు చెన్నై – 600006” అడ్రస్ కు అప్లికేషన్స్ పంపించాలి.
తెలంగాణాలో జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ : 10th అర్హత
ఎలా అప్లై చెయ్యాలి:
ఈ క్రింద ఇవ్వబడిన Links ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఆగష్టు 30వ తేదిలోగా అప్లికేషన్స్ పైన తెలిపిన అడ్రస్ కు పంపించాలి.
అప్లికేషన్స్ ని ఇంగ్లీష్ /హిందీ /తమిళ భాషల్లోనే పూర్తి చెయ్యాలి లేనియెడల మీ అప్లికేషన్ తిరస్కరించడం జరుగుతుంది. అప్లికేషన్ ఫారo మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ను అతికించాలి. అలాగే ₹100/- పోస్టల్ ఆర్డర్ కింద Pay చేసి ఆ రసీధుని అప్లికేషన్ కి అటాచ్ చేసి పంపించాలి.
Notification & Application Form
పోస్టల్ శాఖ నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసమా Freejobsintelugu వెబ్సైటుని సందర్శించండి.