AP TET ఫలితాలు, DSC పరీక్షలపై ముఖ్యమైన అప్డేట్ | AP TET Results 2024 | AP DSC Exams 2024 | AP TET, DSC Latest News Today

AP TET Results 2024 :

AP టెట్ పరీక్ష ఫిబ్రవరి 27 నుండి మార్చి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్దేశించిన పరీక్షా కేంద్రాలలో రెండు షిఫ్టులలో జరిగింది.
AP TET 2024 జవాబు కీ మరియు Response షీట్ 2024 మార్చి 5న జారీ చేయబడ్డాయి. అభ్యర్థులు Response Sheets మరియు సమాధానాల కీలపై అభ్యంతరాలను మార్చి 11 వరకు దాఖలు చేసే అవకాశం కల్పించారు.

AP DSC పరీక్షలపై లేటెస్ట్ అప్డేట్స్:

ఏపీ డీఎస్సీ2024 పరీక్షలపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ టెట్ 2024 ఫలితాలపైనా గందరగోళం ఏర్పడింది. ఎన్నికల్లోగా డీఎస్సీ పరీక్షలు జరుగుతాయా?, టెట్ ఫలితాలు వచ్చేనా? అనేదీ అభ్యర్థులకు ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏకకాలంలో ఏపీ టెట్ 2024, ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్లు ఆర్భాటంగా జారీజేసింది. ఏపీ టెట్ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించగా, ఈలోగా కొందరు అభ్యర్థులు ఏపీ టెట్ ఫలితాలకు, డీఎస్సీకి మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండేలా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరీక్షల నిర్వహణకు కాస్త ఆటంకం ఏర్పడింది. అభ్యర్థుల అభ్యంతరాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుని, ఈ రెండు పరీక్షల మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ టెట్ ఫలితాలను విడుదల చేసి ఆ తర్వాత డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయింది. టెట్ ఫలితాలు రాకపోవడం, డీఎస్సీ పరీక్షలపై స్పష్టత లేకపోవడం వెరసి నిరుద్యోగులకు దిక్కుతోచడం లేదు.

దీనిపై ప్రభుత్వానికి, పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి అనేక మంది వినతులు పంపుతున్నారు. ఏపీ టెట్ ఫలితాలను ప్రకటించి, డీఎస్సీ పరీక్షలను నిర్వహించేందుకుగాను అనుమతి ఇవ్వాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎన్.సురేశ్ కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) లేఖ రాశారు. ఈసీ నిర్ణయం కోసం విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం ఆధారంగానే నిరుద్యోగుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాష్ట్రంలో 6,100 డీఎస్సీ పోస్టులను భర్తీ చేసేందుకుగాను సీఎం జగన్ ప్రభుత్వం చివరి దశలో నోటిఫికేషన్ జారీజేసి తీవ్ర విమర్శల పాలైంది. ఎన్నికల ముందు ఈ నోటిఫికేషన్ ను జారీజేయడంతో న్యాయపరమైన సమస్యలు, ఎన్నికల కోడ్ అంశాలు ఆటంకంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు తమ పాలిట శాపంగా మారాయని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ముందస్తుగా టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేసి ఉంటే తమకు అసౌకర్యం ఉండేది కాదని వాపోతున్నారు.

411 సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల: Apply

TSRTC లో 3000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: Apply

TS TET అభ్యర్థులకు BAD న్యూస్ : వీరు అనర్హులు

AP కోర్టుల్లో అన్ని జిల్లాలవారికి జాబ్స్: Apply

AP DSC Exams Schedule, Hall Tickets Download:

ఎస్జీటీ పోస్టులకు ఎస్ఏలు చెల్లించిన ఫీజును ఇంతవరకు పాఠశాల విద్యాశాఖ చెల్లించలేదు. అభ్యర్థుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులకు ఎస్ఏలకు అర్హత కల్పించకపోవడంపై వేలాది మంది అభ్యర్థులు నిరుత్సాహంగా ఉన్నారు. ఎస్ఏ పోస్టులు అరకొరగానే ఉన్నాయి. తమ ఎస్ఏ పోస్టులతో పాటు ఎసీటీలు రాసుకోవచ్చనే ఆనందంతో ఉండగా వారికి హైకోర్టు తీర్పు నిరాశే మిగిల్చింది. ఇలా టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల జారీ అనంతరం నుంచి అడుగడుగనా న్యాయపరమైన ఆటంకాలు, ఎన్నికల కోడ్ తలెత్తాయి.

ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలతోపాటు ఏపీ డీఎస్సీ పరీక్షల షెడ్యూలు, హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం కల్పించేలా పాఠశాల విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. దీనిపై ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదీ అభ్యర్థులకు టెన్షన్ గా మారింది. ఈ నెలాఖరులోగా టెట్ ఫలితాలను విడుదల చేస్తే, డీఎస్సీ పరీక్షల నిర్వహణకు అవకాశం ఉంటుంది. లేకుంటే ఎన్నికల తర్వాతే డీఎస్సీ పోస్టుల ప్రక్రియ ఉంటుంది. డీఎస్సీ నోటిఫికేషన్ రావడంతో లక్షలాది మంది వివిధ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్లలో వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పుడు టెట్ ఫలితాల పెండింగ్తో పాటు డీఎస్సీ పరీక్షలపై స్పష్టత లేకపోవడంపై అభ్యర్థులు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల ముందు 6,100 పోస్టులతో ప్రకటించిన డీఎస్సీని రద్దు చేసి, ఎన్నికల తర్వాత మెగా డీఎస్సీని విడుదల చేయాలని విపక్షాలు, విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

AP TET Results 2024 Date & Time:

టెట్ ఫలితాలపై విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/ ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.

పాఠశాల విద్యా శాఖ, ఆంధ్రప్రదేశ్ AP TET ఫలితాలను 2024 అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పుడైనా విడుదల చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు 2024కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ల కోసం ఈ ప్రత్యక్ష బ్లాగును తనిఖీ చేస్తూ ఉండండి.

How To Check AP TET Results 2024:

పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి – aptet.apcfss.in.

ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.

హాల్ టికెట్/అడ్మిట్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.

‘Get Results’ బటన్‌పై క్లిక్ చేయండి.

APTET ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.

Official Website : Click Here

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!