Telangana TIMS Notification 2026:
తెలంగాణలోని సనత్ నగర్ లో ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) సంస్థలో పనిచేయడానికి మొత్తం 240 పోస్టులతో కాంట్రాక్ట్ విధానంలో అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఇతర పోస్టులు ఉన్నాయి. 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క మరింత సమాచారం చూడండి
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) నుండి విడుదలైన 240 ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో ఉంది
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) |
| మొత్తం పోస్టులు | 240 |
| పోస్టుల వివరాలు | జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్ |
| అర్హతలు | ఏదైనా డిగ్రీ అర్హత |
| అప్లికేషన్ ఆఖరు గడువు | జూలై 22, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Website Link |
ఉద్యోగాల అర్హతలు:
తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుండి విడుదలైన 240 కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత లేదా డిఎంఎల్టి లేదా mlt, లేదా ఎంబిబిఎస్ అర్హత కలిగి ఉన్నట్లయితే సంబంధిత ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనుభవం ఉన్నవారికి కొంత వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు టిమ్స్ నుండి విడుదలైన కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నారు
అప్లికేషన్ ఫీజు ఉందా?
కాంట్రాక్ట్ విధానంలో విడుదలైన 240 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు
శాలరీ ఎంత?:
జూనియర్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులకు పోస్టులను అనుసరించి 25,000/- నుండి 50000 రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు
ఎలా అప్లై చేయాలి?:
టిమ్స్ తెలంగాణ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్ విధానంలో నిర్ణీత గడువులోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయవలెను
ముఖ్యమైన తేదీలు మరియు లింక్స్:
| అప్లికేషన్ స్వీకరణ ప్రారంభ తేదీ | 15th జూలై, 2026 |
| అప్లికేషన్ గడువు ఆఖరి తేదీ | 22nd జూలై, 2026 |
| నోటిఫికేషన్ | Click Here |
| అప్లికేషన్ ఫారం | Click Here |
తెలంగాణ ఉద్యోగాల సమగ్ర సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి.