తెలంగాణ ఆర్టీసీలో 1500 కండక్టర్ ఉద్యోగాలు భర్తీ | TSRTC 1500 Conductor Jobs Notification 2026

By: Sivakrishna Bandela

On: July 9, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TSRTC Conductor Jobs 2026:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్తగా 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం ఆర్టీసీ సంస్థకు అనుమతులు ఇస్తూ భర్తీ ప్రక్రియ ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ ని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ కండక్టర్ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి పదో తరగతి అర్హత కలిగిన మహిళలు మరియు పురుష అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష ఉండదు. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం.

TSRTC vacancy details:

  • సంస్థ పేరు: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ
  • పోస్టుల పేర్లు: కండక్టర్
  • మొత్తం పోస్టులు: 1500
  • అర్హతలు: పదవ తరగతి
  • ఎంపిక విధానం: మెరిట్ మార్కుల ఆధారంగా
  • నోటిఫికేషన్ విడుదల తేదీ: త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు

విద్యార్హతలు మరియు వయస్సు వివరాలు:

తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణులై 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారై ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది

తెలంగాణ ప్రభుత్వం అనుమతి:

తెలంగాణ ఆర్టీసీలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా కండక్టర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయలేదు. దీంతో రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో భారీగా ఖాళీలు మిగిలిపోయాయి. రాష్ట్రం ఏర్పడిన 12 సంవత్సరాల తర్వాత కొత్తగా కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆర్టీసీకి అనుమతులు ఇవ్వడం జరిగింది. దీంతో తెలంగాణ ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేసేందుకు సన్నద్ధమైంది

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

Marks vs Grade points:

తెలంగాణ ఆర్టీసీలో ఉన్నటువంటి కండక్టర్ ఉద్యోగాల భర్తీ పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా భర్తీ చేయనున్నారు. అయితే గతంలో పదో తరగతి మార్క్స్ లిస్టులో ఎస్ఎస్సి బోర్డు వారు మార్కులను ఇచ్చేవారు, తర్వాత గ్రేట్ పాయింట్స్ ఇచ్చారు, ఇప్పుడు మళ్లీ మార్క్స్ మరియు పర్సంటేజ్ ఇస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఈ మూడు రకాల మార్కులు కలిగిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉన్నందున, మెరిట్ మార్కులు కలిగిన వారిని అంచనా వేయడం కష్టమవుతుండడంతో, తెలంగాణ ఆర్టీసీ వారు ఎస్ఎస్సి బోర్డు కు లేఖ రాశారు. గ్రేట్ పాయింట్లను మార్కులలో ఏ విధంగా మార్చాలో తెలియ చేయవలసిందిగా ఎస్ఎస్సి బోర్డును కోరడం జరిగింది.

తెలంగాణ ఎస్ఎస్సి బోర్డు నుండి సమాధానం వచ్చిన వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ చేస్తారు.

నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు?:

తెలంగాణ ఆర్టీసీ 2026 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ని మరికొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. పాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu

TSRTC Jobs Latest Update

తెలంగాణ ఉద్యోగాల తాజా సమాచారం కోసం మా వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి.

తెలంగాణ జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా టెన్త్ అర్హతతో డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page