Thalliki Vandanam Scheme 2026:
ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుకునేటువంటి విద్యార్థిని మరియు విద్యార్థులకు, వారి చదువులకు అయ్యేటువంటి ఖర్చులను భరించేందుకుగాను విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో ప్రతి విద్యార్థికి ₹15,000/- రూపాయల చొప్పున జమ చేసి, ఆ డబ్బులను విద్యార్థుల చదువులకు ఉపయోగించే విధంగా ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం “తల్లికి వందనం పథకం”. 2026 సంవత్సరానికి గాను ఈ పథకం డబ్బులను జూలై 16, 17, 18 తేదీలలో విద్యాశాఖ నిర్వహించబోయే పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా ₹15,000/- డబ్బులను సంబంధిత విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో జమ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల తెలియజేశారు. ఈ మూడు రోజులపాటు తల్లుల యొక్క ఖాతాల్లో డబ్బులను జమ చేసి రెండో విడత ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
తల్లికి వందనం పథకం డబ్బులు విడుదల చేసే తేదీలు:
తల్లికి వందనం పథకం 2026 సంవత్సరానికి సంబంధించిన ₹15,000/- రూపాయలను జూలై 16, 17, 18 తేదీలలో పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఈ మూడు తేదీలలో తల్లుల ఖాతాల్లో, ఆ తల్లి యొక్క ప్రతి విద్యార్థికి ₹15,000/- రూపాయల చొప్పున ఆ తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కలిపి ఆ తల్లి యొక్క బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. ఈ మూడు తేదీలలో అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలియజేశాడు.
- పథకం పేరు: తల్లికి వందనం
- ప్రతి విద్యార్థికి చెల్లించే నగదు : ₹15,000/-
- తల్లి ఖాతాలో జమ అయ్యే నగదు : ₹13,000/-
- స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసే నగదు : ₹2,000/-
Thalliki Vandanam scheme eligibility list:
తల్లికి వందనం పథకం 2026 లబ్ధిదారుల లిస్ట్ ఇటీవల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.
- మీరు ఈ పథకానికి అర్హులా కాదా తెలుసుకునేందుకు ముందుగా మీ దగ్గరలోని గ్రామా లేదా వార్డు సచివాలయానికి వెళ్ళండి.
- సచివాలయంలో ఉన్న వెల్ఫేర్ అసిస్టెంట్ ని సంప్రదించి, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అడిగి తెలుసుకోవాలి.
- అలాగే సచివాలయంలోని నోటీస్ బోర్డ్ లో లబ్ధిదారుల జాబితా లిస్ట్ ఉంటుంది. అక్కడ మీ పేరు ఉందో లేదో సరి చూసుకోవాలి
- పేరు లేని లబ్ధిదారులు వారి పేరు ఎందుకు లేదో తెలుసుకొని కావలసినటువంటి డాక్యుమెంట్లను సబ్మిట్ చేయవలెను.
- eligible అని లబ్ధిదారుల జాబితాలో ఉన్నవారికి జూలై 16, 17, 18 తేదీలలో తల్లుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి.
ఆన్లైన్లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?:
తల్లికి వందనం పథకం 2026-27 సంవత్సరానికి గాను లబ్ధిదారులు వారి యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని ఆన్లైన్లో ఫాలో అవ్వండి. మీరు ఈ పథకానికి అర్హులా కాదా తెలుసుకోవచ్చు.
- ముందుగా తల్లికి వందనం పథకం అధికారిక వెబ్సైట్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout లోకి వెళ్లండి
- వెబ్సైట్లో లబ్ధిదారుల యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, తల్లికి వందనం పథకం స్కీం ఎంపిక చేసి, 2026-27 సంవత్సరాన్ని ఎంపిక చేసిన తర్వాత, Get Details ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే
- మీరు ఈ పథకానికి ఎలిజిబుల్ అయ్యారా లేదా స్క్రీన్ పైన కనిపిస్తుంది
- ఎలిజిబుల్ అని చూపించినట్లయితే మీకు ఈ పథకంకి సంబంధించిన డబ్బులు సంబంధిత తేదీలలో జమ అవుతాయి
Thalliki Vandanam Scheme Website
తల్లికి వందనం పథకం 2026 సంవత్సరానికి సంబంధించిన తాజా సమాచారం కోసం ప్రతి రోజూ మా వెబ్సైట్ని సందర్శించండి.