AP 10th Results 2026:
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి 2026 ఫలితాలను ఏప్రిల్ 25 లేదా 26వ తేదీన విడుదల కావచ్చని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తెలియజేశారు. మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ రెండవ తేదీ వరకు పరీక్ష నిర్వహించగా, ఏప్రిల్ 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు పరీక్ష పత్రాలు మూల్యాంకనం నిర్వహించారు. ఇప్పటికే పరీక్ష పత్రాలు మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు పరీక్ష ఫలితాలు విడుదల కి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఫలితాలను మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా విడుదల చేసి సప్లిమెంటరీ నిర్వహించాలని భావిస్తున్నారు. ఏపీ 10వ తరగతి పరీక్షల యొక్క తాజా సమాచారం ఇప్పుడు చూడండి.
ఏపీ పదవ తరగతి 2020 ఫలితాలు విడుదల తేదీ ఇదేనా?:
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఏపీ 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 25 లేదా 26వ తేదీలలో, ఈ రెండు తేదీలలో ఏదో ఒక రోజున ఫలితాలు విడుదల చేసేందుకు సమాయత్తమవుతున్నారు. విద్యార్థులు వారి యొక్క ఫలితాలను వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా, అలాగే ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ ద్వారా మరియు ఎస్ఎంఎస్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా ఎలా ఫలితాలు చూసుకోవాలి?:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాట్సాప్ మనమిత్ర సర్వీసెస్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
- ముందుగా వాట్సాప్ మన మిత్రమా సర్వీసెస్ నెంబర్ +91 95523 00009 ను మీ మొబైల్ లో సేవ్ చేసుకోండి
- ఆ నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి.
- వెంటనే సర్వీసెస్ ఎంపిక చేసుకోవాలి అని మెసేజ్ వస్తుంది.
- సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఎడ్యుకేషన్ సర్వీసెస్ ని ఎంచుకోండి.
- అక్కడ ఏపీ పదవ తరగతి ఫలితాలు 2026 ఆప్షన్ క్లిక్ చేయండి
- విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
- వెంటనే మీకు మార్క్స్ మెమో మెసేజ్ రూపంలో వస్తుంది.
- అందులో సబ్జెక్టులవారిగా మీకు వచ్చిన మార్కులు చెక్ చేసుకుని పాస్ అయ్యారా లేదా అనేది చూసుకోండి.
- ఆ మార్క్స్ మెమో అని ప్రింట్ అవుట్ తీసుకోండి
FAQ’s:
1. ఏపీ 10వ తరగతి 2026 పరీక్షలు మొత్తం ఎంతమంది రాశారు?
6.5 లక్షల మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షలు రాశారు.
2. ఫలితాలు చెక్ చేసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?
https://bse.ap.gov.in/Index.aspx వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.