గుడ్ న్యూస్: AP EAMCET 2025 ర్యాంకులు రెండోసారి విడుదల చేయనున్నారు. వీరికి ఇంటర్ మార్కుల వల్ల ర్యాంక్ మారనుంది.

By: Sivakrishna Bandela

On: June 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025 Re-Ranking:

జూన్ 8వ తేదీ సాయంత్రం 5:30 నిమిషాలకు ఏపీ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అది ఏమిటంటే ” qualifying marks (10 + 2) not available అని సూచించబడిన 27,588 మంది విద్యార్థులకు (MPC-18,253, BiPC-9,338) పూర్తిస్థాయిలో ర్యాంకులు ఇవ్వలేదు. ఎందుకంటే వారు తమ ఇంటర్మీడియట్ మార్కులను సబ్మిట్ చేయలేదు. లేదా అప్పటివరకు ఫలితాలు లభించలేదు( ఫెయిల్ అవ్వడం వల్ల లేదా సప్లి పరీక్షల వల్ల ). అయితే ఇప్పుడు ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇంటర్మీడియట్ మార్కులను ఎంసెట్ పోర్టల్ డిక్లరేషన్ ఫామ్ లో సరిచేసిన తర్వాత ఎంసెట్ ర్యాంకులను మళ్లీ విడుదల చేసే అవకాశం ఉంది వారి కోసం ప్రత్యేకంగా.

ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే :

ఇప్పుడు సాధారణంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన వారు లేదా ఇంటర్ రిజల్ట్స్ రావడానికి ఆలస్యం చేసిన వారు, వారి యొక్క ఇంటర్మీడియట్ మార్కులు అందగానే.

Join What’s App Group

  • APSCHE లేదా EAPCET కన్వీనర్ వారి వివరాలను మళ్లీ పరిశీలించవచ్చు.
  • ర్యాంకులు ఇవ్వడం లేదా రీ కంప్యూట్ చేసి కొత్త ర్యాంకులు ఇచ్చే అవకాశం ఉంది.
  • ఇది final phase web counselling కు ముందు జరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం :

MPC STREAM:

ఏపీ టెట్ 2025 పరీక్ష కీ విడుదల తేదీ వచ్చేసింది | AP TET 2025 Exam Key Release Date | Full Details
  • qualified candidates : 1,71,478
  • inter marks not available: 18,253
  • disqualified: 75,089

BiPC Stream:

  • qualified candidates : 58,423
  • inter marks not available :9,338
  • Disqualified : 7,699

ర్యాంకులు ఎలా మారవచ్చు?:

ఇంటర్ మార్కుల ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది.

ఏపీ ఎంసెట్ 2005లో మీకు వచ్చిన ర్యాంకు ఆధారంగా ఏ కాలేజీలో సీటు వస్తుంది ఇప్పుడే తెలుసుకోండి.

AP EAMCET ర్యాంక్ = 75% → EAPCET Marks + 25% → Inter Marks (Maths, Physics, Chemistry లేదా Biology)

AP District Court Results 2025 | AP District Court Jobs Results 2025 Release Date : Full Details

ఉదాహరణకు:

ఒక విద్యార్థికి ఎంసెట్ లో మంచి ర్యాంకు వచ్చిన ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చినట్లయితే అతనికి ర్యాంకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే, ఇంటర్ లో మంచి మార్కులు వచ్చినా, ఎంసెట్ లో తక్కువ score చేస్తే మెరుగైన ర్యాంక్ మీరు ఆశించలేరు.

AP EAMCET 2025 Re-Ranking అవకాశం ఉందా:

అవకాశం ఉంది. ఎందుకంటే, ఎంసెట్ ర్యాంకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంటర్ మార్కులు తప్పనిసరి. గతంలో కూడా అధికారులు పలు సందర్భాలలో ఇంటర్ మార్క్స్ పొందిన తర్వాత ర్యాంక్ ఇవ్వడం అంటూ ప్రకటనలు చూసిన సందర్భాలు ఉన్నాయి.

Re-Ranking వల్ల ఎవరికి లాభం:

  • సప్లమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు.
  • ఇంటర్ మార్కులు ఆలస్యం చేసిన విద్యార్థులు
  • ఎప్పటికైనా కౌన్సెలింగ్ కు హాజరవాలనుకునే వారు.

కావున ఇంటర్ మార్కులు ఇప్పట్లో అందుబాటులోకి వస్తే, ఏపీ ఎంసెట్ 2025 ర్యాంకులను మళ్లీ రెండవసారి విడుదల చేసే అవకాశం ఉంది. వీటిని అధికారికంగా చెక్ చేయాలి అంటే ఈ క్రింది వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి.

AP SSC 2026 పరీక్షలు షెడ్యూల్ వచ్చేసింది | AP SSC 2026 Exams Time Table | AP 10th Class Public Exam Time Table 2026

https://cets.apsche.ap.gov.in/EAPCET

ఇప్పుడు మీరు ఏం చేయాలి?:

  • మీ ఇంటర్ మార్కులను పోర్టల్ ద్వారా వెంటనే సబ్మిట్ చెయ్యండి.
  • అధికారిక వెబ్సైట్ ను తరచూ చెక్ చేస్తూ ఉండండి.
  • కౌన్సిలింగ్ తేదీలను మిస్ అవ్వొద్దు.

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మా వెబ్సైట్ ని తరచూ సందర్శిస్తూ ఉండండి

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page