తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు: 10th అర్హతతో వెంటనే అప్లై చేయండి

By: Sivakrishna Bandela

On: May 7, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Telangana Outsourcing Jobs:

తెలంగాణలోని అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా మహేశ్వరంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి 63 అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. రికార్డ్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండర్, వార్డ్ బాయ్, కార్పెంటర్ టైలర్ బార్బర్, ఎలక్ట్రిషన్ ప్లంబర్ థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, ఈసీజీ టెక్నీషియన్, ఇతర చాలా రకాల పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటూ డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా షాట్లిస్ట్ చేసి అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ అర్హతలు వయస్సు పూర్తి సెలక్షన్ ప్రాసెస్ వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ఉద్యోగాల వివరాలు:

తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి పోస్టుల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి.

Join What’s App Group

పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య
ల్యాబ్ అటెండెట్స్ 13
రిఫ్రాక్షనిస్ట్ లేదా ఆప్టీషియన్ 01
రేడియో గ్రాఫిక్ టెక్నీషియన్04
ఓటి టెక్నీషియన్04
ఎనస్తీషియా టెక్నీషియన్ 04
డెంటల్ టెక్నీషియన్01
బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్04
రికార్డు క్లర్క్ లేదా రికార్డు అసిస్టెంట్ 01
కేటలోగర్01
మ్యూజియం అసిస్టెంట్ కం ఆర్టిస్ట్01
ఆడియో విజువల్ టెక్నీషియన్01
వార్డ్ బాయ్04
దోబీ లేదా ప్యాకర్ 03
కార్పెంటర్01
టైలర్03
ఎలక్ట్రీషియన్01
ప్లంబర్03
థియేటర్ అసిస్టెంట్02
గ్యాస్ ఆపరేటర్06
ఈ సి జి టెక్నీషియన్ 02
బార్బర్03
మొత్తం పోస్టులు63

పోస్టుల వివరాలు, అర్హతలు:

తెలంగాణలోని మహేశ్వరంలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి విడుదలైన 63 ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి ఇంటర్ మీడియట్ లేదా 10+2, ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు మెడికల్ సంబంధిత అర్హతలు కలిగినటువంటి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంత వయస్సు ఉండాలి?:

తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ ఉన్న SC, ST, BC, EWS అభ్యర్థులకు వయోపరిమితిలో మరో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

ఐడిబిఐ బ్యాంకుల్లో 676 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

  • OC, ఓబీసీ అభ్యర్థులు: ₹200/- ఫీజు చెల్లించాలి
  • ఎస్సీ, ఎస్టి అభ్యర్థులు : ₹100/- ఫీజు చెల్లించాలి
  • వికలాంగులకు ఎటువంటి ఫీజు లేదు

ఫీజు చెల్లించాల్సిన అభ్యర్థులు ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహేశ్వరం పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి, పూర్తి చేసిన దరఖాస్తు ఫారంతో పాటు డిడి రిసిప్ట్ కూడా పంపించాలి.

  • అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్: ది ప్రిన్సిపల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహేశ్వరం, BIET క్యాంపస్, మంగల్ పల్లి,ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లా – 501510 అడ్రస్ కు పంపించాలి

సెలక్షన్ ప్రాసెస్ :

తెలంగాణ మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది

  1. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్స్ షార్ట్ లిస్ట్ చేస్తారు
  2. మెరిట్ ఆధారంగా ఎంపిక
  3. డాక్యుమెంట్ వెరిఫికేషన్
  4. అపాయింట్మెంట్ ఆర్డర్స్

శాలరీ ఎంత ఉంటుంది?:

తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,600/- నుండి ₹22,750/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

ఎలా అప్లై చేయాలి:

ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి

  • ఆఫీసియల్ వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారంని గడువులోగా సంబంధిత డిపార్ట్మెంట్ కి పంపించాలి
  • అప్లికేషన్ ఫీజు డీడీ తీసి, డీడీ రిసిప్ట్ కూడా అప్లికేషన్ తో పాటు పంపించాలి

ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 1st మే, 2025
  • దరఖాస్తు ఆఖరి తేదీ : 10th మే, 2025
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ:17th మే, 2025
  • అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీ : 19th మే, 2025

Notification PDF

Official Website

FAQ’s:

1. తెలంగాణ అవుట్ సోర్సింగ్ జాబ్స్ మొత్తం ఎన్ని ఉద్యోగాలు?

63 ఉద్యోగాలు ఉన్నాయి.

తెలంగాణలో భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

2. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ ఏమిటి?

మే 10వ తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ ని సబ్మిట్ చేయాలి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page