AP Anganwadi Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ పంచాయితీల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులభర్తీకి స్థానిక మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. 7th లేదా 10వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర గ్రామాలు, ఇతర జిల్లాల వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. కడప జిల్లాలోని స్థానిక గ్రామ పంచాయతీలోని మహిళలు మాత్రం దరఖాస్తు చేసుకోవాలి. అంగన్వాడీ ఉద్యోగాల పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అంగన్వాడీ ఉద్యోగాల అర్హతలు, వయస్సు వివరాలు:
వైస్సార్ కడప జిల్లాలోని వివిధ ICDS ప్రాజెక్ట్స్ లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ విడుదల చేశారు.
అంగన్వాడీ కార్యకర్తలు : 11 ఖాళీలు
అంగన్వాడీ సహాయకురాలు : 59 ఖాళీలు
మినీ అంగన్వాడీ కార్యకర్తలు : 04 ఖాళీలు
పైన తెలిపిన పోస్టులకు స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 7th క్లాస్ లేదా 10వ తరగతి అర్హత కలిగినవారు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
దరఖాస్తు చేసుకునే తేదీలు:
దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీ : 17th సెప్టెంబర్
ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ : 28th సెప్టెంబర్.
ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం : కడప జిల్లాలోని శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారిక కార్యాలయంనందు ఇంటర్వ్యూకు నిర్వహించడం జరుగుతుంది.
సెలక్షన్ ప్రాసెస్ :
అంగన్వాడీ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా 10th, 7th క్లాస్ లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తారు
10th అర్హత కలిగి ఉంటే : 50 మార్కులు
ప్రీ స్కూల్స్ టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటే : 5 మార్కులు
వితంతువులైతే : 5 మార్కులు
అభ్యర్థి అనాధ అయినట్లయితే : 10 మార్కులు
అభ్యర్థి వికలాంగురాలు అయితే : 05 మార్కులు
ఇంటర్వ్యూకి : 20 మార్కులు
మొతం : 100 మార్కులు
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
కడప జిల్లా ICDS ప్రాజెక్ట్ నుండి దరఖాస్తులు తీసుకొని మీ దరఖాస్తుకు పూర్తి చేసి 17th సెప్టెంబర్ తేదీలోగా అప్లికేషన్స్ ని సబ్మిట్ చెయ్యాలి. ఆఖరు తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్స్ తిరస్కరించడం జరుగుతుంది.
అంగన్వాడీ ఉద్యోగాల సమాచారం కోసం. మా వెబ్సైటుని సందర్శించండి.