Telangana VRO Recruitment 2024:
తెలంగాణాలో రద్దు అయినటువంటి విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ (గ్రామ రెవిన్యూ అధికారి) వ్యవస్థను మళ్ళీ పునరుద్దరించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది 10,954 గ్రామాల్లో ఒక్కో ఉద్యోగిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. దీనికి సంబందించి అందుబాటులో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ అధికారి(VRO), గ్రామ రెవిన్యూ సహాయక అధికారి (VRA) లుగా పని చేసినవారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.గతంలో 23వేల మందికి పైగా రెవిన్యూ అధికారులను వేరే డిపార్ట్మెంట్ లోకి సర్దుబాటు చేసింది. వారిని ఏ విధంగా రెవెన్యూ వ్యవస్థలో VRO లుగా వినియోగించుకోవాలి అనే దానిపై తర్జన భర్జన పడుతోంది.
ఎవరు అర్హులు:
ప్రస్తుతం గ్రామ రెవెన్యూ అధికారి(VRO), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (VRA) లుగా పని చేస్తున్నవారిలో ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులుకు రాత పరీక్ష నిర్వహించిన తర్వాతనే కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెవిన్యూ వ్యవస్థలో వారికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం యొచ్చిస్తోంది. కొత్తగా ROR (ఆర్ ఓ ఆర్) చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఈ పరీక్ష నిర్వహించి, తెలంగాణా రాష్ట్రంలోని 10,954 గ్రామాలకు రెవెన్యూ ప్రతినిధులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
కనీస విద్యార్హత నిర్ణయించే క్రమంలో VRO, VRA లలో 15వేల మందికి పైగా పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారని, వారిలో పరీక్ష ఉత్తీర్ణత సాధించినవారికి అవకాశం కల్పించి, మిగిలినవారికి కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
కొత్త నోటిఫికేషన్?:
10,954 గ్రామాల్లో VRO లను నియమించడానికి రాత పరీక్ష పెట్టి అందులో అర్హత పొందిన వారిని నియమించి మిగిలిన పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తారు.
తెలంగాణలో 11,000 అంగన్వాడీ జాబ్స్
విద్యార్హతలు:
గ్రామ రెవెన్యూ అధికారులుగా ఎంపిక చెయ్యాలి అంటే ఒక నిరుద్యోగ అభ్యర్థికి 10త / ఇంటర్ అర్హత ఉండాలి. కొత్తగా ఏర్పాటు చేయబోయే రెవిన్యూ వ్యవస్థలో VRO లుగా ప్రస్తుతం ఉన్న అధికారులకు రాత పరీక్ష పెట్టడానికి వారికి ఇంటర్ లేదా డిగ్రీ అర్హత ఉండాలి అని ప్రభుత్వం చెబుతోంది.
శాలరీ ఎలా ఉంటాయి?:
VRO లుగా ఎంపిక అయినవారికి ప్రభుత్వం అన్ని అలవెన్స్లు కలుపుకొని ₹25,000/- వరకు జీతం చెల్లిస్తారు.
ఇస్రోలో 10త అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు
ఎంత వయస్సు ఉండాలి?:
కొత్తగా విడుదల చేసే VRO నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. sSC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
కొత్తగా నియమించబోయే VRO ల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత పూర్తి సమాచారం అందించడం జరుగుతుంది.
VRO Jobs Notification : Update PDF
తెలంగాణా విద్య, ఉద్యోగాల సమాచారం కోసమా మా వెబ్సైటు Freejobsintelugu ని సందర్శించండి.