ఆంధ్రప్రదేశ్ DME డిపార్ట్మెంట్ లో 997 ఉద్యోగాలు | AP DME Notification 2024 | Freejobsintelugu

AP DME Notification 2024:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి పలు విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 997 సీనియర్ రెసిడెంట్స్ మరియు సూపర్ స్పెషలిస్ట్స్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మెడికల్ ఎడ్యుకేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ 997 పోస్టులకు Apply చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండా మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ ఉద్యోగాలు ఇస్తారు

పోస్టుల వివరాలు:

క్లినికల్ పోస్టులు : 425

నాన్ క్లినికల్ పోస్టులు : 479

సూపర్ స్పెషలిస్ట్స్ : 93

పైన తెలిపిన పోస్టులు అవసరాన్ని బట్టి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

Join Our Telegram Group

విద్యార్హతలు, వయస్సు వివరాలు:

మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యుయేలేషన్స్ టీచర్ ఎలిజిబిలిటీ అర్హతల ప్రకారం MD/MS//DNB/MDS లో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసినవారు Apply చేసుకోవాలి. లేదా DNB చేసినవారు అర్హులు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి AP మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకున్నవారు అర్హులు.

పోస్టల్ శాఖలో 10th అర్హతతో గవర్నమెంట్ జాబ్స్

అప్లికేషన్ ఫీజు ఆఖరు తేదీ:

OC అభ్యర్థులయితే ₹1000/- ఫీజు చెల్లించాలి, SC, ST, OBC అభ్యర్థులయితే ₹500/- ఫీజు చెల్లించాలి. అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ లోనే చెల్లించాలి. ఆఫ్ లైన్ లో చెల్లించిన వారి అప్లికేషన్స్ Reject చెయ్యడం జరుగుతుంది.

ఆగష్టు 27వ తేదీలోగా ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

రైల్వేలో 14,298 గవర్నమెంట్ జాబ్స్: Apply

సెలక్షన్ ప్రాసెస్:

పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో వచ్చిన merit మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. SC, ST, BC, EWS, PHC అభ్యర్థులకు రూల్ ఆఫ్ రెసర్వేషన్ పాటించడం జరుగుతుంది.

జీతం, కాంట్రాక్ట్ కాలపరిమితి:

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹70,000/- జీతం చెల్లిస్తారు. ఒక సంవత్సరం పాటు పిన్ని చెయ్యాలి.

TTD లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ చేసే విధానం:

అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు ఈ క్రింద తెలిపిన సర్టిఫికెట్లను ఆన్లైన్ లో సబ్మిట్ చెయ్యాలి.

  1. SSC సర్టిఫికెట్ ( మార్క్స్ లిస్ట్)
  2. AP మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న PG డిగ్రీ సర్టిఫికెట్
  3. MD/MS/DNB పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్స్ లిస్ట్
  4. MBBS, PG కాపీ ఆఫ్ డిగ్రీ / ప్రోవిషనల్ సర్టిఫికెట్స్
  5. కుల ధ్రువీకరణ పత్రం ( SC, ST, BC, EWS, PHC)
  6. PHC సర్టిఫికెట్
  7. ఆధార్ కార్డు
  8. 4th నుండి 10th వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్స్ ఆన్లైన్ లో సబ్మిట్ చెయ్యాలి

పైన తెలిపిన సర్టిఫికెట్స్ లో ఒక్కటీ లేకపోయిన మీ అప్లికేషన్స్ తిరస్కరించడం జరుగుతుంది.

ఎలా Apply చెయ్యాలి:

క్రింద పొందుపరిచిన నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఆన్లైన్ లింక్ ద్వారా అప్లికేషన్స్ సబ్మిట్ చెయ్యాలి

Notification PDF

Apply Online

ఆంధ్రప్రదేశ్ విద్య, ఉద్యోగాల సమాచారం కోసం ప్రతి రోజూ మా Freejobsintelugu వెబ్సైటుని సందర్శించండి

Leave a Comment

error: Content is protected !!