ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదలైంది – ఇలా దరఖాస్తులు చేసుకోండి. | inter admissions 2026 started

By: Sivakrishna Bandela

On: March 26, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Intermediate admissions 2026:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించి జనరల్ మరియు ఒకేషనల్ కోర్సులలో రెండేళ్ల ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించడానికి జాయిన్ అయ్యే విద్యార్థుల కోసం అడ్మిషన్స్ షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ విడుదల చేసింది. ఎందుకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాష విడుదల చేసిన షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 – 27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఏప్రిల్ ఒకటి 2026వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యార్థులనుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించాలని విద్యాశాఖ సూచించింది. ఏప్రిల్ ఆరో తేదీ నుండి జూన్ ఒకటో తేదీ వరకు ప్రవేశాలు నిర్వహించాలని షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి తేదీగా జూన్ 1 నిర్ణయించినట్లు రంజిత్ భాష తెలిపారు. ఇక జోన్ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు.

AP ICET 2026 Application Last Date LIVE : Registration With Late FEE ₹1000/- (Ongoing) at cets.apsche.ap.gov.in

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు అలాగే ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, సహకార, రెసిడెన్షియల్, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మోడల్ జూనియర్ కళాశాలతో పాటు ఇంటర్మీడియట్ కోర్సులను అందించే కాంపోజిట్ డిగ్రీ కాలేజీల్లో అన్ని కేటగిరీలు, కోటాలకు ఈ షెడ్యూల్ వర్తిస్తుందని ఆయన తెలియజేయడం జరిగింది.

తప్పనిసరిగా రికార్డులను నిర్వహించడానికి, ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను నిర్దేశిత కాల పరిమితిలోగా UDISE ప్లస్ వెబ్సైట్లో నమోదు చేయాలని ఆయా కాలేజీలకు సంబంధించిన ప్రిన్సిపాల్ అందరికి ఆదేశించడం జరిగింది.

ఏపీ 10th, ఇంటర్ పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP 10th & Inter Exams Postponed – New Exam Dates – Full Details

రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నిటిలో ప్రవేశ ప్రక్రియను క్రమబద్దీకరించడం, ఏకరూపతను నిర్ధారించడం కోసం షెడ్యూల్ తప్పనిసరిగా అనుసరించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తెలిపారు. ఆఖరి నిమిషంలో కలిగే అసౌకర్యాలను నివారించడం కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిర్దేశించిన తేదీలలోగా ప్రవేశ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించడం జరిగింది.

కావున పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం యొక్క అడ్మిషన్స్ కి అప్లై చేసుకోగలరు. అప్లై చేసుకున్న వారందరికీ జూన్ ఒకటో తేదీ నుండి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి

AP 10th Class 2026 Hall Tickets | AP SSC 2026 Hall Tickets | AP SSC Hall Tickets 2026

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page